ఆ యువ హీరో మీద ఆశలు పెట్టుకున్న బేబమ్మ..!
తొలి సినిమా ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ హిట్ తో సూపర్ క్రేజ్ అందుకోగా ఆ నెక్స్ట్ అరడజను అవకాశాలు అందుకుంది.
By: Tupaki Desk | 24 May 2025 2:00 PM ISTతొలి సినిమా ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ హిట్ తో సూపర్ క్రేజ్ అందుకోగా ఆ నెక్స్ట్ అరడజను అవకాశాలు అందుకుంది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు పర్వాలేదు అనిపించగా ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా నిరాశ పరిచాయి. అదేంటో మొదటి రేంజ్ హిట్ కృతి శెట్టి చేసిన ఏ సినిమా అందుకోకపోవడంతో అమ్మడికి అవకాశాలు కూడా రాకుండా అయిపోయింది. లాస్ట్ ఇయర్ శర్వానంద్ తో మనమే సినిమా చేసినా లాభం లేకుండా పోయింది.
ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఉన్న సినిమా L.I.K ఒక్కటే. తమిళ యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథ్ హీరోగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా అది. ఆ సినిమా మీదే బేబమ్మ ఆశలన్నీ పెట్టుకుంది. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో ప్రదీప్ సినిమాలన్నీ యూత్ ఫుల్ హిట్లుగా మారుతున్నాయి. L.I.K సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.
ప్రదీప్ చేస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ కి కూడా సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. లవ్ టుడేతో ఇవానా గ్రాండ్ సక్సెస్ అందుకుని టాప్ లీగ్ లోకి వెళ్లగా డ్రాగన్ తో కయదు లోహర్ కి క్రేజ్ పెరిగింది. ఇక అదే దారిలో కృతి శెట్టికి కూడా లక్ కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఎల్.ఐ.కె లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటూ రాబోతున్న ఈ సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్.
యూత్ ఫుల్ సినిమాలతో ప్రదీప్ రంగనాథ్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. L.I.K కూడా అదే దారిలో హిట్ పడితే కృతి శెట్టికి ఒక పెద్ద్ రిలీఫ్ వచ్చినట్టు అవుతుంది. మరి బేబమ్మకి ఈ సినిమా ఎంత లక్ అవుతుంది అన్నది చూడాలి. వరుస హిట్లు పడుతుంటే ఛాన్స్ లు వస్తాయి కానీ ఫ్లాపుల వల్ల అవకాశాలు మిస్ అవుతాయి. ప్రదీప్ ఎల్.ఐ.కె తో పాటు తమిళంలో కృతి శెట్టి జినీ సినిమా కూడా చేస్తుంది. ఈ రెండు సినిమాల మీదే అమ్మడు కెరీర్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.తెలుగు, తమిళ్ మాత్రమే కాదు మలయాళంలో కూడా ప్రయత్నాలు చేస్తుంది కృతి శెట్టి. ఆల్రెడీ అక్కడ టోవినో థామస్ తో ఏ.ఆర్.ఎం సినిమా చేసింది బేబమ్మ.
