Begin typing your search above and press return to search.

అమ్మడిలో ఆ బెంగ కనపడట్లేదే..?

ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అంతకుముందు మోడలింగ్ లో మెప్పించింది. ఐతే ఒక సినిమా చేసే దాకా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

By:  Tupaki Desk   |   25 July 2025 11:39 AM IST
అమ్మడిలో ఆ బెంగ కనపడట్లేదే..?
X

ఉప్పెనతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి అంతకుముందు మోడలింగ్ లో మెప్పించింది. ఐతే ఒక సినిమా చేసే దాకా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఐతే ఎప్పుడైతే ఉప్పెన బ్లాక్ బస్టర్ అయ్యిందో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ ఫ్లోలో వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంది. తొలి సినిమా హిట్టు పడితే ఆ పాజిటివిటీ వేరేలా ఉంటుంది. ఐతే అదొక్కటే ఉంటే సరిపోదు తర్వాత సినిమాలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయాలి. ఒకటి కాకపోతే మరొకటైనా అదే రేంజ్ సక్సెస్ సాధించాలి.

కానీ బ్యాడ్ లక్ ఏమో కానీ ఉప్పెన హిట్ తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలతో పర్వాలేదు అనిపించుకున్న కృతి శెట్టి ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా నిరాశ పరిచాయి. కృతి శెట్టి చేస్తున్న సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడంతో ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. లాస్ట్ ఇయర్ శర్వానంద్ తో మనమే సినిమా చేసింది అమ్మడు. ఆ సినిమా తో కూడా అమ్మడు పెద్దగా మెప్పించలేదు.

సినిమా ఫలితాలు ఎలా ఉన్నా నటిగా కృతి శెట్టి కూడా అంత గొప్ప పర్ఫార్మెన్స్ లు ఇచ్చింది లేదు. అందుకే మిగతా హీరోయిన్స్ లానే ఆమెను కూడా లైట్ తీసుకున్నారు ఆడియన్స్. ప్రేక్షకులు ఆసక్తి చూపిణట్లేదు కాబట్టే దర్శక నిర్మాతలు కూడా ఆమెను తీసుకోవట్లేదు. ఐతే తెలుగులో వర్క్ అవుట్ కావట్లేదని తమిళ్ కి షిఫ్ట్ అయ్యింది కృతి శెట్టి. ప్రస్తుతం అక్కడ ఎల్.ఐ.కె, జినీ సినిమాలు చేస్తుంది కృతి.

ఐతే సినిమాల ఛాన్స్ లు ఎలా ఉన్నా తన సోషల్ మీడియా ఫోటో షూట్స్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు కృతి శెట్టి. మొదట్లో గ్లామర్ షో విషయంలో డౌట్ పడ్డ కృతి శెట్టి ఈమధ్య రెచ్చిపోయి మరీ గ్లామర్ షో చేస్తుంది. ఐతే ఈ షోల వల్ల ఏమైనా అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి. ఐతే అవకాశాలు రావట్లేదు అనే బెంగ ఏమాత్రం తనలో కనిపించకుండా ఫోటో షూట్స్ తో మెప్పిస్తుంది కృతి శెట్టి. మరి అమ్మడు తిరిగి టాలీవుడ్ లో ఎప్పుడు కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. కోలీవుడ్ లో మాత్రం చేస్తున్న రెండు సినిమాల మీద కృతి శెట్టి చాలా హోప్స్ పెట్టుకుంది. మరి ఈ సినిమాలతో అమ్మడి ఫేట్ మారుతుందేమో చూడాలి.