పిక్‌టాక్ : అందాల బేబమ్మ రొమాంటిక్ ఫోజ్
'ఉప్పెన' సినిమాతో చిన్న వయసులోనే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.
By: Tupaki Desk | 20 July 2025 12:14 PM IST'ఉప్పెన' సినిమాతో చిన్న వయసులోనే హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. హీరోయిన్‌గా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ దక్కడంతో ఇండస్ట్రీలో ఈమె పేరు మారుమ్రోగింది. అంతకు ముందు బాల నటిగా చేసినా, కమర్షియల్ యాడ్స్‌లో చేసినా కూడా రాని గుర్తింపు ఉప్పెన సినిమాతో కృతి శెట్టి దక్కించుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ కృతి శెట్టి సొంతం అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు. మొదటి సినిమాలో పద్దతైన లంగా ఓనీ, చుడీదార్‌లో కనిపించిన శృతి శెట్టి ఆ తర్వాత కూడా అదే తరహా పాత్రలను దక్కించుకుంది. మెల్ల మెల్లగా స్కిన్ షో చేస్తూ అందాల ఆరబోత చేస్తూ వచ్చింది.
కృతి శెట్టి ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. ఉప్పెన హిట్ కారణంగా కృతికి అర డజను సినిమాల్లో ఆఫర్లు దక్కాయి. మొదట్లో వరుసగా సినిమాలు హిట్ అయ్యాయి. కానీ తెలుగులో మాచర్ల నియోజకవర్గం నుంచి మొదలుకుని వరుసగా ఫ్లాప్స్ చవిచూస్తూ వచ్చింది. దాంతో కృతి శెట్టికి తెలుగులో ఆఫర్లు తగ్గాయి. ఆమెకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది, అంతే కాకుండా ఆమెకు సోషల్ మీడియాలో తెలుగు వారి నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ అందాల బేబమ్మకు టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆఫర్లు కనుమరుగు అయ్యాయి. కస్టడీ తర్వాత కృతి శెట్టి ఆఫర్లు తగ్గాయి. గత ఏడాది మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
టాలీవుడ్ లో ఆఫర్లు తక్కువ కావడంతో కృతి శెట్టి లక్కీగా తమిళ్, మలయాళ సినిమాల నుంచి ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. ఆ మధ్య వచ్చిన మలయాళ మూవీ ఏఆర్‌ఎం తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఏకంగా మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఖచ్చితంగా రెండు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి అనే విశ్వాసంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కృతి శెట్టి రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన రెడ్ టాప్, బ్లూ జీన్స్ ఔట్ ఫిట్ కృతి శెట్టి మరింతగా మెరిసేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు. క్యూట్ బ్యూటీ కాస్త ఈ రొమాంటిక్ ఫోజ్‌లో చూపు తిప్పనివ్వడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈమె చేస్తున్న వా వాతియర్ సినిమా విడుదలకు ముస్తాబు అవుతోంది. ఇక ఈమె ప్రదీప్ రంగనాథన్ తో చేస్తున్న లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్న ఈ సినిమాతో కృతి శెట్టికి మరోసారి తెలుగులో మంచి పేరు వస్తుందని, తద్వారా తెలుగు సినిమా ఆఫర్లు సైతం వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు జీనీ అనే తమిళ మూవీలోనూ కృతి శెట్టి నటిస్తోంది. ఇంతకు ముందు పెద్దగా అందాల ఆరబోత చేయని కృతి శెట్టి ఇప్పుడు స్కిన్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న నేపథ్యంలో వరుస ఆఫర్లు, ముఖ్యంగా కమర్షియల్ పాత్రలు చేసే అవకాశాలు రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
