కృతి షెట్టి.. డెనిమ్ స్కర్ట్ లో హీటెక్కించేచేసిందిగా..
కృతి ఈ ఫోటోషూట్ ద్వారా ప్రముఖ బ్రాండ్ కి ప్రమోట్ చేస్తోంది. ఇది కృతి కెరీర్ లో బ్రాండింగ్ పరంగా మరో ముందడుగుగా భావించవచ్చు.
By: Tupaki Desk | 17 April 2025 11:16 PM ISTటాలెంట్ తో పాటు గ్లామర్, స్టైల్ పరంగా కూడా కృతి షెట్టి ఎప్పుడూ ఫ్రంట్‌లోనే ఉంటుంది. 'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన లేటెస్ట్ లుక్‌తో మరోసారి సోషల్ మీడియాలో ఫుల్ అటెన్షన్ దక్కించుకుంది. ఓ బ్రాండెడ్ హూడీ, షార్ట్ డెనిమ్ స్కర్ట్, స్టయిలిష్ యెల్లో షూస్ లో కృతి ఇచ్చిన స్టన్నింగ్ పోస్టులు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.
ఇన్‌డోర్ లో సాఫ్ట్ లైట్ ఎఫెక్ట్ తో తీసిన ఈ ఫోటోలు.. కృతి ఫ్యాషన్ సెన్స్ ఎంత మోర్డన్‌గా మారిందో చూపిస్తున్నాయి. ఆమె వేసుకున్న క్రీమ్ కలర్ హూడీపై ఉన్న డిజైన్, హెయిర్ స్టైల్, అలాగే జీన్స్ షార్ట్‌పై వేసుకున్న పోజ్ లు ఫ్యాన్స్ కి కొత్తగా అనిపించాయి. ముఖ్యంగా మినిమల్ మేకప్ లోనూ ఆమె ఫేస్ గ్లో, ఎక్స్‌ప్రెషన్స్ అసలు మిస్ కాలేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
కృతి ఈ ఫోటోషూట్ ద్వారా ప్రముఖ బ్రాండ్ కి ప్రమోట్ చేస్తోంది. ఇది కృతి కెరీర్ లో బ్రాండింగ్ పరంగా మరో ముందడుగుగా భావించవచ్చు. ఇక ఉప్పెన అనంతరం అమ్మడు అవకాశాలు బాగానే అందుకున్నా హిట్స్ అయితే పెద్దగా రాలేదు. ఇక సక్సెస్ లేకున్నా ఫ్యాషన్ రంగంలో కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా అడుగులు వేస్తోంది.
ఇటీవల కృతి తక్కువ సినిమాలు చేస్తోందన్న కామెంట్లు వచ్చినా.. ఆమె ఫొటోషూట్లు మాత్రం నిత్యం హైలైట్ అవుతున్నాయి. ఈ లేటెస్ట్ లుక్ చూసినవాళ్లంతా.. “ఫ్యాషన్ కి న్యూ డెఫినిషన్ ఇచ్చింది కృతి షెట్టి” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు, “ఈ యంగ్ హీరోయిన్‌ను త్వరలో మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్ట్స్‌లో చూసే అవకాశాలు ఉన్నాయంటూ” టాక్ వినిపిస్తోంది.
కృతి ఫొటోలు నెటిజన్లను ఎంతగా ఆకట్టుకున్నాయో ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉంది “మీరు ఆకర్షించాలనుకునే శక్తిగా ఉండండి.”. మొత్తానికి స్పోర్టీ లుక్‌లో కృతి షెట్టి.. మరోసారి ట్రెండింగ్ స్టైల్ ఐకాన్‌గా ముద్ర వేసిందనడంలో సందేహమే లేదు. మరి అమ్మడికి రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
