అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా.. ఇప్పుడు హీరోయిన్‌గా!
చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆడియన్స్ మనసు దోచేసిన ఎంతోమంది ఇప్పుడు పెద్దయ్యాక కూడా నటననే ఎంచుకుని ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు.
By: Tupaki Desk | 20 May 2025 2:00 AM ISTచైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆడియన్స్ మనసు దోచేసిన ఎంతోమంది ఇప్పుడు పెద్దయ్యాక కూడా నటననే ఎంచుకుని ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. కొంతమంది సైడ్ ఆర్టిస్టులుగా నటిస్తుంటే మరికొందరు హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. సంతోష్ శోభన్, తేజ సజ్జ, సంగీత్ శోభన్ ఇప్పటికే హీరోలుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
వీరితో పాటూ కావ్య కళ్యాణ్ రామ్, ఎస్తేర్ అనిల్, శ్రీవిద్య లాంటి చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు హీరోయిన్లుగా సత్తా చాటాలని ఇప్పటికే పలు ప్రయత్నాలు చేశారు. అయితే ఓ నటి మాత్రం చిన్నప్పుడు ఓ హీరో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడదే హీరో పక్కన హీరోయిన్ గా నటిస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఉప్పెన భామ కృతి శెట్టి.
టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోయిన్ గా ఇప్పటికే పలు సినిమాలు చేసిన కృతి శెట్టి చిన్నప్పటి నుంచే పలు యాడ్స్ లో నటించింది. ఐడియా, పార్లే, షాపర్స్ స్టాప్ యాడ్స్ లో నటించిన కృతి 2019లో సూపర్30 లో ఓ చిన్న క్యారెక్టర్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది. దాని కంటే ముందే కార్తీ హీరోగా నటించిన నా పేరు శివలో కూడా కొన్ని క్షణాల పాటూ కృతి కనిపించింది.
అప్పుడు కార్తీ సినిమాలో చిన్న పాపగా నటించిన కృతి, కట్ చేస్తే ఇప్పుడు కార్తీతో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. నలన్ కుమారసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వా వాతియార్ అనే సినిమాలో కార్తీకి జోడీగా కృతి శెట్టి నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాయి. అయితే కృతి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తున్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు మీమర్స్ ఈ విషయంపై మీమ్స్ కూడా చేస్తున్నారు.
