Begin typing your search above and press return to search.

బేబమ్మ బోల్డ్ టాక్స్.. ఐనా కానీ..!

అంతేకాదు ఏదైనా బోల్డ్ సబ్జెక్ట్ ఉన్నా కూడా చేయాలని చూస్తుందట. యూత్ ఆడియన్స్ కి ఈమధ్య కాస్త బోల్డ్ రోల్స్ చేసిన హీరోయిన్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు.

By:  Tupaki Desk   |   27 May 2025 5:00 AM IST
బేబమ్మ బోల్డ్ టాక్స్.. ఐనా కానీ..!
X

ఉప్పెన తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ లో ఒక మంచి పాపులారిటీ సంపాదించింది. ఐతే ఆ సినిమా తో వచ్చిన క్రేజ్ కొన్నాళ్లే ఉండగా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు తప్ప తర్వాత అన్నీ కూడా నిరాశపరిచాయి. కృతి శెట్టి చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు కూడా సన్నగిల్లాయి. తెలుగులో చివరగ మనమే సినిమా చేసింది బేబమ్మ. ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.

మరోపక్క తమిళ్ లో అమ్మడు ఎల్.ఐ.కె, జినీ సినిమాలు చేస్తుంది. ఆ రెండిటి మీదే అంచనాలను పెట్టుకుంది. ఈమధ్యలో మలయాళంలో కూడా ఒక సినిమా ట్రైల్ వేసిన అమ్మడు అక్కడ పర్వాలేదు అనిపించుకున్నా నెక్స్ట్ ఛాన్స్ లు మాత్రం రాలేదు. అందుకే కలిసి వచ్చిన టాలీవుడ్ మీదే ఇంకాస్త ఫోకస్ పెట్టాలని అనుకుంటుంది కృతి శెట్టి. ఐతే ఇన్నాళ్లు గ్లామర్ షో విషయంలో కాస్త మొహమాటం చూపించిన అమ్మడు ఇక మీదట గ్లామర్ గేట్లు ఎత్తేయాలని ఫిక్స్ అయ్యింది.

అంతేకాదు ఏదైనా బోల్డ్ సబ్జెక్ట్ ఉన్నా కూడా చేయాలని చూస్తుందట. యూత్ ఆడియన్స్ కి ఈమధ్య కాస్త బోల్డ్ రోల్స్ చేసిన హీరోయిన్స్ ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఐతే కెరీర్ లో ఇప్పటివరకు కృతి శెట్టి గ్లామర్ రోల్స్ చేసింది లేదు. ఆమెకు వచ్చిన అవకాశాలను చేస్తూ కెరీర్ వెళ్లదీసింది. ఐతే గేర్ మార్చి అమ్మడు గ్లామర్ రోల్స్ బోల్డ్ అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయ్యింది. అలా చేస్తేనన్నా ఆడియన్స్ లో తను ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలనని అనుకుంటుంది అమ్మడు.

కృతి శెట్టి యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్నా ఇక మీదట దానికి తోడు గ్లామర్ షో కూడా తోడైతే కెరీర్ ఇంకాస్త బెటర్ గా ఉంటుందని భావిస్తుంది. ఐతే బేబమ్మ నిర్ణయం వల్ల నిజంగానే ఆమె కెరీర్ ఊపందుకుంటుందా లేదా అన్నది చూడాలి. క్లాస్ లుక్స్ తో కుర్రాళ్లను మెప్పించిన కృతి శెట్టి ఇక మీదట గ్లామర్ డోస్ పెంచి అదరగొట్టాలని చూస్తుంది. మరి అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.