Begin typing your search above and press return to search.

హనుమాన్ × శ్రీఆంజనేయం… కృష్ణవంశీ ఏమన్నారంటే..

దీనిపై కృష్ణవంశీ రియాక్ట్ అయ్యాడు. ఆడియన్స్ అభిప్రాయాన్ని ఎప్పుడు తప్పు పట్టకండి. వారెప్పుడు క్లారిటీగానే ఉంటారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:30 AM GMT
హనుమాన్ × శ్రీఆంజనేయం… కృష్ణవంశీ ఏమన్నారంటే..
X

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా లీడ్ రోల్ లో వచ్చిన హనుమాన్ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఈ మూవీ టాలీవుడ్ లో హైయెస్ట్ ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాల జాబితాలో టాప్ 3లో ఉంది. నార్త్ ఇండియా ఆడియన్స్ కి అయితే హనుమాన్ విపరీతంగా కనెక్ట్ అయ్యింది. ఓవర్సీస్ లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.

అయితే క్రియేటివి డైరెక్టర్ కృష్ణవంశీ హనుమాన్ క్యారెక్టరైజేషన్ బ్యాక్ డ్రాప్ లో 2004లో శ్రీ ఆంజనేయం అనే సినిమా చేశాడు. మూవీలో సాంగ్స్ అద్భుతంగా కుదిరాయి. కథ కూడా చాలా బాగుంటుంది. అయితే మూవీలో కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం వలన ఫ్లాప్ అయ్యింది. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గానే ఆ చిత్రాన్ని కృష్ణవంశీ ఆవిష్కరించారు. నితిన్ కి ఇష్టమైన సినిమాలలో అది కూడా ఒకటి.

కొంతమంది హనుమాన్, శ్రీ ఆంజనేయం సినిమాలని పోల్చి సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం బాగుందని పోస్టులు పెట్టారు. ఎందుకో ఆ టైంలో శ్రీ ఆంజనేయం మూవీ ఆడియన్స్ అర్ధం చేసుకోలేకపోయారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీనిపై కృష్ణవంశీ రియాక్ట్ అయ్యాడు. ఆడియన్స్ అభిప్రాయాన్ని ఎప్పుడు తప్పు పట్టకండి. వారెప్పుడు క్లారిటీగానే ఉంటారు.

వారికి రీచ్ అయ్యే విధంగా నేను చెప్పలేకపోయి ఉండొచ్చు. ఆడియన్స్ ని బ్లేమ్ చేయొద్దు. కొన్ని పోర్షన్స్ నచ్చేలా చెప్పడంలో నేనే రాంగ్ అయ్యి ఉండొచ్చు.. ఏమైనా మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు అంటూ రీట్వీట్ చేశారు. కృష్ణవంశీ ట్వీట్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ని తప్పుపట్టే టెక్నీషియన్స్ ఉన్నారు.

అలాంటిది ఆడియన్స్ సినిమాకి ఇచ్చే రిజల్ట్ ఎప్పుడు తప్పు కాదు. వారికి రీచ్ అయ్యేలా చెప్పడంలో మన ఫెయిల్యూర్ ఉందని కృష్ణవంశీ ఒప్పుకున్నారు. అందుకే అతను గొప్ప దర్శకుడు అయ్యాడంటూ కితాబు ఇస్తున్నారు. అలాగే కృష్ణవంశీ మళ్ళీ అదిరిపోయే కథతో ఓ మంచి సినిమా చేస్తే చూడాలని కోరుకుంటున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు.