Begin typing your search above and press return to search.

కృష్ణ గాడు అంటే ఒక రేంజ్.. గేట్ రెడీ!

ఒక గడసారి అమ్మాయితో ప్రేమలో పడిన ఒక కూల్ లోకల్ బాయ్ కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతోందని ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు

By:  Tupaki Desk   |   3 Aug 2023 9:42 AM GMT
కృష్ణ గాడు అంటే ఒక రేంజ్.. గేట్ రెడీ!
X

ఈవారం బాక్సాఫీస్ వద్ద మరికొన్ని డిఫరెంట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇక అందులో లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ సినిమా కూడా విడుదలవుతోంది.

రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పెట్ల కృష్ణమూర్తి, పెట్ల వెంకట సుబ్బమ్మ, మరియు పిఎన్‌కె శ్రీలత నిర్మించారు.

ఈ సినిమా ద్వారా రాజేష్ దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మొత్తానికి సినిమా థియేటర్లలోకి రావడానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' ఆగస్ట్ 4న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక గ్యాప్ లేకుండా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ద్వారానే ప్రమోషన్స్ లో జోష్ చుపోస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ అలాగే ట్రైలర్ కూడా విడుదల చేశారు.

ఒక గడసారి అమ్మాయితో ప్రేమలో పడిన ఒక కూల్ లోకల్ బాయ్ కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతోందని ట్రైలర్ లోనే క్లారిటీ ఇచ్చారు. ఇక విలేజ్ లో ప్రేమలో పడిన అనంతరం కృష్ణకు ఎలాంటి అనుమానాలు, సమస్యలు ఎదురయ్యాయి.. చాలా చులకనగా చేసి చూసే వారికి కృష్ణ తన రేంజ్ ను ఎలా చూపించాడు అనేది సినిమాలోని మరో కోణంగా ఉండబోతోందట.

విభిన్నమైన ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. రియాలిటీకి దగ్గరగా ఉండే ఈ సినిమా కథ కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జానర్‌లలో కలగలిపి ఉంటుందని తెలిపారు.

టీజర్‌, ట్రైలర్‌, పాటల్లో పల్లెటూరి వాతావరణం అందాలను హైలెట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం, సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఇక ఫైనల్ గా 'కృష్ణ గాడు అంటే ఒక రేంజ్' ఆగస్ట్ 4న విడుదలకు సిద్ధమయ్యింది. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి. రఘు, స్వాతి పొలిచెర్ల, సుజాత, వినయ్, మహదేవ్ ఇతర ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబు తలారి ఎడిటర్. వరికుప్పల యాదగిరి ఈ చిత్రానికి పాటలు స్వరపరిచారు.