Begin typing your search above and press return to search.

క్రిష్ హీరోని సెట్ చేసే ప‌నిలో ఉన్నాడా?

ఓ హీరోని ప‌ట్టుకుని వీలైనంత త్వ‌ర‌గా సినిమా చేయాల‌ని భావిస్తున్నారుట‌. 2024 ఎన్నిక‌లు అయ్యే లోపు క్రిష్ క‌నీసం రెండు సినిమాలైనా చేసి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారుట‌.

By:  Tupaki Desk   |   19 Aug 2023 2:30 AM GMT
క్రిష్ హీరోని సెట్ చేసే ప‌నిలో ఉన్నాడా?
X

'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'వారాహి' యాత్ర‌లో బిజీగా ఉండ‌టంతో వీర‌మ‌ల్లుకి తాత్కాలికంగా బ్రేకులు వేసారు. తిరిగి ఎప్పుడు షూటింగ్ ప్రారంభ‌మ వుతుందో తెలియదు. ఏపీలో తాజా పొలిటిక‌ల్ సినారే నేప‌థ్యంలో ఎన్నిక‌లు పూర్తయ్యే వ‌ర‌కూ ప‌వ‌న్ సినిమా షూటింగ్ ల‌కు హాజ‌ర‌య్యేలా క‌నిపించ‌లేదు. ఎన్నిక‌లు ముందొస్తుంగా వస్తాయ‌ని భావించి ఇలా యాత్ర‌లు ఉన్న‌ట్లుండి చేయాల్సి వ‌చ్చింది. వాస్త‌వానికి అంత‌కు ముందు నుంచి ఈ సినిమా షూటింగ్ న‌త్త‌న‌క‌డ‌క సాగుతోంది.

సోషియా ఫాంట‌సీ సినిమా కావ‌డంతో ప‌వ‌న్ షూటింగ్ కి ఎక్కువ డేట్లు కేటాయించాల్సి రావ‌డం... దానికి అనుగుణంగా ఆయ‌న స‌ర్దుబాటు చేయ‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డంతో తాత్కాలికంగా ప‌క్క‌న‌బెట్టి తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకునే ప‌నిలో ఉన్న‌ట్లు లీకులందాయి. ఓ హీరోని ప‌ట్టుకుని వీలైనంత త్వ‌ర‌గా సినిమా చేయాల‌ని భావిస్తున్నారుట‌. 2024 ఎన్నిక‌లు అయ్యే లోపు క్రిష్ క‌నీసం రెండు సినిమాలైనా చేసి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారుట‌.

ప‌వ‌న్ సెట్స్ కి వ‌చ్చేది ఎలాగూ ఎన్నిక‌ల త‌ర్వాతే కాబ‌ట్టి అన‌వ‌సరంగా స‌మ‌యాన్ని వృద్దా చేసుకోవ‌డం దేనిక‌ని ప‌నులు స్పీడ‌ప్ చేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హీరోలు దొర‌క‌డం అంత సుల‌భం కాదు. స్టార్ హీరోలంతా వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నారు. టైర్-2 హీరోల షెడ్యూల్ కూడా బిజీగానే ఉంది. టైర్ -3 హీరోల‌తో సినిమాలు చేయాలంటే? అంత కింద‌కు క్రిష్ దిగి రావాల్సి ఉంటుంది. మ‌రి క్రిష్ ఏ హీరోని ముందుగా లాక్ చేస్తారు? అన్న‌ది చూడాలి.

ప్ర‌స్తుతం కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల‌కు మంచి స‌క్సెస్ రేట్ ఉంది. అలాంటి క‌థ‌లకి క్రిష్ కాస్త క‌మ‌ర్శియ‌ల్ ట‌చ‌ప్ ఇవ్వ‌గ‌లిగితే తిరుగుండ‌దు. 'కొండ‌పొలం' లాంటి చిత్రాలు ఓటీటీలో బాగానే ఆడాయి. క‌మ‌ర్శియ‌ల్ గా సక్సెస్ కాన‌ప్ప‌టికీ ఓటీటీలో మంచి రేటింగ్ సాధించింది ఆ సినిమా. అలాంటి క‌థ‌ల్ని ఇంకాస్త మెరుగ్గా తీయ‌గ‌ల్గితే తిరుగుండ‌దు.