డైరెక్టర్ క్రిష్ హరి హరకు దూరంగానే ఉంటారా?
అయితే ప్రాజెక్ట్ ఏళ్లుగా సాగుతుండటం, టీమ్‌తో మనస్పర్దలు తలెత్తడంతో సినిమా 80 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్లిపోయారు.
By: Tupaki Desk | 23 May 2025 11:19 AM ISTపవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'. ఏ.ఎం. రత్నంకిది అత్యంత కీలకమైన సినిమా. భారీ బడ్జెట్‌తో మళ్లీ నిర్మాతగా ట్రాక్‌లోకి రావాలన్న ఆలోచనతో ఏ.ఎం.రత్నం ఈ భారీ పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టారు. కరోనా ముందు మొదలైన ఈ మూవీ గత కొన్నేళ్లుగా ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
అయితే ప్రాజెక్ట్ ఏళ్లుగా సాగుతుండటం, టీమ్‌తో మనస్పర్దలు తలెత్తడంతో సినిమా 80 శాతం షూటింగ్ పూర్తయిన తరువాత క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్లిపోయారు. రెండు భాగాలుగా ఈ మూవీని రూపొందిస్తున్నామంటూ ప్రకటించిన టీమ్ క్రిష్ స్థానంలో దర్శకుడిగా జ్యోతికృష్ణని తీసుకొచ్చింది. తను నిర్మాత ఏ.ఎం.రత్నం తనయుడు. తనే పెండింగ్ ఉన్న షూటింగ్‌ని పూర్తి చేశాడు. గత కొన్నేళ్లుగా ఆగుతూ సాగుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది.
జూన్ 12న సినిమాని భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ప్రమోషన్స్‌ని టీమ్ ఇటీవలే మొదలు పెట్టింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. ఇంతకీ ఈ మూవీ ప్రమోషన్స్‌లో దర్శకుడు క్రిష్ పాల్గొంటారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. హరి హర వీరమల్లు మూవీని ఆయన 80 శాతంకు పైనే పూర్తి చేశారు. ఆ తరువాతే మేకర్స్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
ఎవరు కాదన్నా 'హరి హర వీరమల్లు' ఆయన సినిమానే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఆయన ఖచ్చితంగా పాల్గొనాల్సిందే. అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే గతంలో కంగనతో ఆయన చేసిన `మణికర్ణి`కు నుంచి కూడా ఇలాగే తప్పుకున్న క్రిష్ ఆ తరువాత ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదు. పూర్తిగా అవాయిడ్ చేశారు. 'హరి హర వీరమల్లు' ప్రమోషన్స్‌ని కూడా ఆయన ఇలాగే అవాయిడ్ చేస్తారా? లేక ఇది నా ప్రాజెక్ట్ అని ప్కరమోషన్స్‌లో పాల్గొంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
