అనుష్క ఘాటి... క్రిష్‌పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్
వీరమల్లు సినిమా ఆలస్యం అవుతుంది అంటూ ఘాటీ మొదలు పెట్టిన క్రిష్ ఆ సినిమాను స్పీడ్‌గా రూపొందించి, వెంటనే ఏమైనా విడుదల చేశాడా అంటే అది కూడా లేదు.
By: Tupaki Desk | 2 July 2025 11:28 AM ISTపవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాను మొదట క్రిష్ తెరకెక్కించాడు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటంతో డేట్లు కేటాయించలేక పోయాడు. మరీ ఆలస్యం అవుతుందని, మరేదైనా సినిమాను చేస్తాను అంటూ అనుష్కతో ఘాటీ మొదలు పెట్టాడు. వీరమల్లు సినిమాను మొదలు పెట్టడానికి ముందు కొండ పొలం సినిమాను సైతం క్రిష్ చేసిన విషయం తెల్సిందే. కానీ ఘాటీ సినిమాను చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వడంతో జ్యోతికృష్ణ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చింది. ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాకు క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ పేరును కూడా టైటిల్ కార్డ్స్‌లో వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను మధ్యలో వదిలేశాడు అంటూ క్రిష్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు.
వీరమల్లు సినిమా ఆలస్యం అవుతుంది అంటూ ఘాటీ మొదలు పెట్టిన క్రిష్ ఆ సినిమాను స్పీడ్‌గా రూపొందించి, వెంటనే ఏమైనా విడుదల చేశాడా అంటే అది కూడా లేదు. ఘాటీ సినిమాను గత రెండు మూడు నెలలుగా వాయిదాలు వేస్తూనే ఉన్నారు. మొదట ఏప్రిల్ నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆ తేదీకి సినిమాను విడుదల చేయలేక పోయారు. దాంతో జులై సినిమాకు వాయిదా వేశారు. మొన్నటి వరకు జులై 11న సినిమా విడుదల కాబోతుంది అంటూ ప్రచారం చేశారు. కానీ జులై లో సినిమా విడుదల అనేది సాధ్యం అయ్యేలా లేదు. ఇప్పటి వరకు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు.
ఘాటీ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో అసంతృప్తిగా ఉన్న క్రిష్ రిలీజ్‌ను వాయిదా వేశాడని తెలుస్తోంది. ఘాటీ సినిమా కోసం వీరమల్లు సినిమాను వదిలేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ సినిమాను కూడా సమయానికి విడుదల చేయలేక పోతున్నాడని, కొన్ని సినిమాలు కొన్ని సార్లు ఆలస్యం అవుతాయి, అంత మాత్రానికి మొత్తం వదిలేయడం కరెక్ట్ కాదు అంటూ ఈ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు కొందరు క్రిష్ పై ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరమల్లును పూర్తి చేసి ఆ తర్వాత మరో సినిమాను క్రిష్ చేసి ఉంటే గౌరవంగా ఉండేది, కానీ ఇప్పుడు ఆయన ఘాటీ సినిమాను విడుదల చేయడంలో కూడా కిందా మీదా పడుతున్నాడు అంటూ పవన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అనుష్క చాలా కాలం తర్వాత ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత అనుష్క నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే క్రిష్ మంచి కంటెంట్‌తో సినిమాను రూపొందించి ఉంటాడు. వీరిద్దరి కాంబోలో వేదం సినిమా తర్వాత ఘాటీ రాబోతుంది. వేదం సినిమాలో అనుష్క ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో కూడా అనుష్క హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ వాయిదాల మీద వాయిదాలు పడితే సినిమా బజ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ చివరి దశలో ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో అయినా సినిమా వస్తుందేమో చూడాలి.
