కంటెంట్ ఉన్న క్రిష్‌కు ఈ కష్టాలేంటో..
ఒక దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన రెస్పెక్ట్ అందుకునే వారిలో క్రిష్ టాప్.లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు.
By: Tupaki Desk | 22 April 2025 11:49 AM ISTఒక దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన రెస్పెక్ట్ అందుకునే వారిలో క్రిష్ టాప్.లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. చెప్పే ప్రతీ కథలో ఒక కొత్త పాయింట్ ను టచ్ చేయడమే కాకుండా, సందేశం కూడా ఉండేలా జాగ్రత్త పడతాడు. లిమిటెడ్ బడ్జెట్ లో జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేయగల సమర్థుడు. గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి సినిమాల ద్వారా మొదట్లోనే టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దర్శకుడు, కేవలం కమర్షియల్ హంగులతో కాకుండా, కంటెంట్‌తో కూడిన సినిమాలు చేసే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా క్రిష్ పరిస్థితి చూస్తే, ఆ సృజనాత్మకతకు తగ్గ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైందంటే, "ఎన్టీఆర్ బయోపిక్" నుంచే అని చెప్పొచ్చు. బాలకృష్ణతో చేసిన ఆ బయోపిక్ కు హైప్ వచ్చిందిగానీ, చివరకు రెండూ భాగాలకు కూడా సరైన ఫలితం దక్కలేదు. దర్శకుడిగా క్రిష్ ప్రతిష్టకే పెద్ద దెబ్బ పడింది.
బాలీవుడ్ లో చేసిన మణికర్ణిక చివరి వరకు వచ్చి హీరోయిన్ తో విబేధాల కారణంగా డ్రాప్ అయ్యాడు. ఇక హరిహర వీరమల్లు విషయంలో ఏం జరిగిందో గాని చివర్లో డ్రాప్ అయ్యాడు. ఇదంతా చూస్తుంటే క్రిష్ సరిగ్గా మేనేజ్‌మెంట్ పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. కానీ సినిమా ప్రారంభమైన దశ నుంచి వాయిదాలు, ఆలస్యం, షెడ్యూల్ సమస్యలు మొదలయ్యాయి.
చివరకు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. పవన్ రాజకీయంగానూ బిజీ కావడం వల్ల షూటింగ్ ఆలస్యం కావడమే కాక, దర్శకుడిగా క్రిష్‌కు చాలా నిరుత్సాహం కలిగించిందని టాక్. అక్కడినుంచి కొత్తగా అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో "ఘాటి" అనే సినిమాను ప్రారంభించాడు. టీజర్ ఆకట్టుకున్నా, సినిమా తీరు అలాగే నిలిచిపోయింది. ఏప్రిల్ 18న విడుదల అవుతుందన్న ప్రకటన ఇచ్చినా, ఆ డేట్ దాటిపోయినా కూడా ఏ అప్‌డేట్ లేదు.
షూటింగ్ ముగిసిందా? ఎడిటింగ్ పూర్తయ్యిందా? అనేది తెలియదు. ఒకప్పుడు చకచకా సినిమాలు తీసే క్రిష్ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల విషయంలో అయోమయంలో పడిపోయాడు. వాస్తవానికి ‘కంటెంట్’ ఉన్న దర్శకుడిగా, క్లాస్ యూనివర్సల్ ఆడియన్స్‌కి నచ్చే కథలు చెప్పగలిగినవాడిగా ఉన్న క్రిష్, ఈ తరహా మార్పులకి గురవడం ఆశ్చర్యంగా మారింది. తను ఎంచుకునే కథల విషయంలో తడబడటం లేదు గానీ, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ విషయంలో గందరగోళం కొనసాగుతోంది.
వీరమల్లు విషయంలో అయితే తన తప్ప లేదు. అలాగని పవన్ మిస్టేక్ కూడా లేదు. పాలిటిక్స్ కారణంగా నేను అనుకున్న సమయానికి రాకపోవచ్చని ప్రాజెక్టు ఓకే చేసే ముందే పవన్ నిర్మాత దర్శకుడికి క్లియర్ గా చెప్పారు. కానీ మరీ ఇంత ఆలస్యం అవుతుందని వాళ్ళు ఊహించి ఉండరు. డేట్స్ మేనేజ్‌మెంట్, స్కెచ్ ఫాలో అయిపోవడంలో లోపాలున్నాయని పలువురు సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో క్రిష్ తనకు సెట్ అయ్యే కథతో ఓ క్లారిటీ స్కెచ్‌తో సినిమా చేయాలి.
