కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్ చూశారా..?
సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో తెలియదు కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 18న రిలీజ్ ప్లాన్ చేశారు.
By: Tupaki Desk | 4 July 2025 7:15 PM ISTరానా సమర్పణలో ప్రవీణా పరుచూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. పరుచూరి విజయ, ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనిక, ఉషా బోనెల నటిస్తున్నారు. ఈమధ్యనే ప్రీ లుక్ పోస్టర్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ఈ టీం లేటెస్ట్ గా టీజర్ తో ప్రేక్షకులను వచ్చింది.
ఇక టీజర్ విషయానికి వస్తే ఊరిలో రికార్డింగ్ స్టూడియో నడిపించే హీరోకి ఒక డ్యన్సర్ అవసరం పడుతుంది. ఐతే ఊళ్లో ఆ డ్యాన్సర్ కోసం వెతుకుతుంటాడు అతను. ఆ ఊరే కాదు పక్కూళ్లో కూడా అలా వేట కొనసాగిస్తాడు. ఐతే ఒక ఊరిలో హీరోయిన్ వెంట పడుతున్న అతన్ని చూసి ఊరి వాళ్లు ఆ ఊరి పెద్ద దగ్గరకు తీసుకెళ్తారు. ప్రస్తుతానికి టీజర్ లో ఉన్న మ్యాటర్ అయితే అదే కొత్తపల్లో ఒకప్పుడు ఏం జరిగింది పూర్తి కథ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎప్పుడు మొదలు పెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో తెలియదు కానీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను జూలై 18న రిలీజ్ ప్లాన్ చేశారు. కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల తర్వాత ఆ నిర్మాతల నుంచి వస్తున్న మరో సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు. టీజర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. తప్పకుండా సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండేలా ఉంది. రానా టేకప్ చేశాడు అంటే ఆ సినిమాలో విషయం కచ్చితంగా ఉంటుంది.
రానాలో ఉన్న నిర్మాత ఎప్పుడు మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుని వాటిని ఎంకరేజ్ చేస్తాడు. తప్పకుండా కంచెరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాల తరహాలో ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా ఆడియన్స్ ని అలరిస్తుందేమో చూడాలి. ఈ సినిమాను జూలై 18న రిలీజ్ ఫిక్స్ చేయగా ప్రమోషనల్ కంటెంట్ గా వదిలిన టీజర్ ఇంప్రెస్ చేసింది. మరి ఇదే విధంగా సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.
టీజర్ చూస్తే ఇదో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఒక ఇన్నోసెంట్ కథగా ఉంది. కంచెరపాలెం, ఉమామహేశ్వర సినిమా కథలు కూడా అలాంటి నేపథ్యంతోనే వచ్చాయి. మరి వాటి సరసన ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.