Begin typing your search above and press return to search.

దేవుడంటే నిజమో, అబద్దమో కాదు.. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' ట్రైలర్

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు.

By:  Tupaki Desk   |   10 July 2025 12:10 PM IST
దేవుడంటే నిజమో, అబద్దమో కాదు.. కొత్తపల్లిలో ఒకప్పుడు ట్రైలర్
X

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. 'కేరాఫ్ కంచెరపాలెం', 'కీడా కోలా', 'ఈ నగరానికి ఏమైంది' వంటి సూపర్ హిట్ సినిమాలు అందులో భాగమే. తాజాగా ఆయన నిర్మించిన లేటెస్టు సినిమా 'కొత్తపల్లిలో ఒకప్పుడు'. ప్రవీణ పరుచూరి ఈ సినిమా తెరకెక్కించారు. గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.


ఇదిగోండి మేడమ్! ఈయన ఉన్నారే, ఆయన మంచం ఎక్కి తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. నడవలేడు, నిబబడలేడు. మా అత్తను తలచుకుంటే రెండు నిమిషాల్లో పరిగెట్టేస్తాడు అంటూ డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. పూర్తిగా ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఓ గ్రామంలో వడ్డీ వ్యాపారం ఇచ్చే వ్యక్తి, జమీందార్, సావిత్రి అనే క్యారెక్టర్ చూట్టు కథ తిరుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

అలాగే ట్రైలర్ ఆఖర్లో ఓ సీన్ తో సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. ఇలా తెలియని భయం ఏదో గ్రామస్థులను భయపెడుతుంది. దీన్ని ఛేదించేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. ఇక దెయ్యం భయంతో వచ్చేది కాస్త రాలేదు, రాలేంది కాస్త వచ్చేసిందండి అనే డైలాగ్తో వీడియో ముగిసింది. ఓవరాల్గా ఈ ట్రైలర్ మూవీ లవర్స్ కు ఆసక్తి కలిగేంచాల ఉంది.

కాగా, 'కేరాఫ్ కంచెరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాల నిర్మాత ప్రవీణ పరుచూరి ఈ సినిమాతో డైరెక్టర్గా మారారు. ఆమె మెగాఫోన్ పట్టి తెరకెక్కించి ఈ తొలి చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప‌ర‌చూరి విజ‌య్ ప్ర‌వీణ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనిక, ఉషా బోనె తెరంగేట్రం చేస్తున్నారు. ర, బెనర్జీ, వీంద్ర విజయ్, ఫణి, బొంగు సత్తి, ప్రేమ్ సాగర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా జూలై 18న థియేటర్ లలోకి రానుంది.