Begin typing your search above and press return to search.

కోట బొమ్మాళి PS సెన్సార్.. గెట్ రెడీ!

ఈ సినిమాలో శ్రీకాంత్ మేకా, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు

By:  Tupaki Desk   |   20 Nov 2023 4:18 AM GMT
కోట బొమ్మాళి PS సెన్సార్.. గెట్ రెడీ!
X

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అలాగే పోలీస్ నేపథ్యంలో సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఇక ఇప్పుడు ఆ రెండు పాయింట్స్ మంచి సందేశం తో కూడిన కోట బొమ్మాళి PS అనే సినిమా రాబోతోంది. ప్రస్తుతం రాజకీయ అంశాలను టార్గెట్ చేస్తూ పోలీసులు వ్యవస్థలను కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. GA2 పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.


ఈ సినిమాలో శ్రీకాంత్ మేకా, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించారు. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ లభించింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి మరి కొద్ది రోజులే ఉంది. నవంబర్ 24న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది.

బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రానికి రంజిన్ రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం అందించారు. 'లింగి లింగిడి' పాట అనే పాట ఏ స్థాయిలో క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల సమయంలో రాజకీయ ఒత్తిడిలో చిక్కుకునే కానిస్టేబుళ్లు రామకృష్ణ (శ్రీకాంత్) మరియు రవి (రాహుల్ విజయ్) అలాగే కుమారి (శివానీ రాజశేఖర్) జీవితాలను ఏ విధంగా మలుపు తిప్పింది అనే అంశంతో ఈ కథ ఆకట్టుకోనుంది.

మురళీ శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరి 30 నిమిషాల సీన్స్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారని తెలుస్తోంది. ఇక రాజకీయ నాయకుల కారణంగా న్యాయంగా పనిచేసే పోలీసులు అధికారులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఎలక్షన్ సమయంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? సాధారణ జనాలు ఓట్ల మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు? అనే అంశాలను సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒకవైపు తెలంగాణ మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న టైమ్ లో ఈ తరహా సినిమా రావడం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ పోస్టర్స్ టీజర్ ట్రైలర్ అంచనాలు పెంచేశాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రెంజ్ లో క్లిక్ అవుతుందో చూడాలి.