Begin typing your search above and press return to search.

కోటబొమ్మాళి.. ఎన్నికలో వేడిలో క్రేజీ సాంగ్

ఇక జీఏ 2 సంస్థలో రూపొందుతున్న ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఉండగా తేజ మార్ని దర్శకుడు

By:  Tupaki Desk   |   11 Nov 2023 1:38 PM GMT
కోటబొమ్మాళి.. ఎన్నికలో వేడిలో క్రేజీ సాంగ్
X

గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో ఇటీవల చిన్న సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. అనేక సినిమాలు నిర్మించి మరచిపోలేని విజయాలు సొంతం చేసుకున్న గీత సంస్థలో గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా కొన్ని మీడియం రేంజ్ సినిమాలు మినీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి.


భలే భలే మగాడివోయ్, గీత గోవిందం లాంటి బిగ్ సక్సెస్ లను చూసిన ఈ సంస్థ అప్పుడప్పుడు ఇతర భాషలకు చెందున6 సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారు. ఇక మలయాళ సూపర్ హిట్ గా నిలిచిన నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇక జీఏ 2 సంస్థలో రూపొందుతున్న ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఉండగా తేజ మార్ని దర్శకుడు. ప్రముఖ నటులు శ్రీకాంత్ మేక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్పెషల్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగేలా లింగిడి లింగిడి అనే పాట వచ్చింది. ఆ సాంగ్ చాలా తక్కువ టైమ్ లొనే ఒక ఊపు ఉపేసింది.

ఇక ఇప్పుడు మరో ఆసక్తికరమైన లిరికల్ టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. అది కూడా ఎలక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండడం, ఇక ఎన్నికల హడావుడి కొనసాగుతున్న టైమ్ లో రిలీజ్ చేయడం మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. ఓటర్లకు డబ్బు ఆశ చూపించే నాయకులు ఉండడం వంటి అంశాలను హైలెట్ చేయడం ఇప్పటి వాతావరణంకు పర్ఫెక్ట్ గా సరిపోయింది.

ఇక రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను నవంబరు 24 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ కరెక్ట్ గా తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో 24న విడుదల అవుతుండడంతో మరింత ఆసక్తి పెరిగింది. మరి సినిమా ఎన్నికల వేడిలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.