Begin typing your search above and press return to search.

కోట బొమ్మాళి హడావిడి షురూ

సెప్టెంబర్‌ 11వ తారీకున ఈ సినిమాలోని పాటను విడుదల చేయబోతున్నట్లుగా గీతా ఆర్ట్స్ వర్గాల వారు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   8 Sep 2023 5:26 PM GMT
కోట బొమ్మాళి హడావిడి షురూ
X

పలు సూపర్‌ హిట్ చిత్రాలను అందించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుండి 'కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్‌' సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్‌ మూవీ నాయట్టు కు ఇది రీమేక్‌. మొదట్లో ఈ సినిమా రీమేక్ గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి. ఇటీవలే ఈ సినిమా మోషన్‌ పోస్టర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.


రీమేక్ అయినా కూడా గీతా ఆర్ట్స్ వారు నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అంతే కాకుండా నటీ నటులు స్టార్స్ లేకున్నా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఈ సినిమాకు మంచి బజ్‌ క్రియేట్ అవ్వడానికి కారణం గీతా ఆర్ట్స్ కు సంబంధించిన సినిమా అవ్వడం విశేషం.

సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ కీలక పాత్ర లో నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయిన ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. అయినా కూడా ప్రమోషన్‌ మొదలు పెట్టారు.

తాజాగా ఈ సినిమా నుండి పాటను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్‌ 11వ తారీకున ఈ సినిమాలోని పాటను విడుదల చేయబోతున్నట్లుగా గీతా ఆర్ట్స్ వర్గాల వారు ప్రకటించారు. పాట విడుదల తర్వాత కచ్చితంగా సినిమా పై అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.