Begin typing your search above and press return to search.

ఎదురు చూపులకు తెర దించిన అల్లు కాంపౌండ్‌

మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో నాయట్టు సినిమా ఒకటి

By:  Tupaki Desk   |   31 July 2023 5:54 AM GMT
ఎదురు చూపులకు తెర దించిన అల్లు కాంపౌండ్‌
X

2021 వ సంవత్సరంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో నాయట్టు సినిమా ఒకటి. జోజు జార్జ్‌, కుంచాకో బోబన్‌, నిమిషా సజయన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాకు మార్టిన్‌ ప్రక్కట్ దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలైన వెంటనే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడం జరిగింది.


మలయాళంలో సూపర్ హిట్ అయిన నేపథ్యం లో తెలుగు రీమేక్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటగా ఈ రీమేక్ ను రావు రమేష్, అంజలి ప్రధాన పాత్రల్లో రూపొందించేందుకు చర్చలు జరిగాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని సమాచారం.

ఏం జరిగిందో ఏమో కానీ అల్లు అరవింద్ ప్రాజెక్టు మొత్తాన్ని మార్చేశారు. శ్రీకాంత్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రల్లో ఈ రీమేక్ ను ప్రారంభించడం జరిగింది. గత ఏడాది షూటింగ్‌ ప్రారంభం అయినా కూడా ఎలాంటి హడావుడి చేయకుండా సైలెన్స్ ను మెయింటెన్ చేయడం జరిగింది.

ఎట్టకేలకు ఈ రీమేక్ ఎదురుచూపులకు తెర దించుతూ గీతా ఆర్ట్స్ వారు టైటిల్ ని రివీల్ చేయడం జరిగింది. కోట బొమ్మాళి అనే టైటిల్తో ఈ సినిమా తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మోషన్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. మంచి కంటెంట్ సినిమా అన్నట్లుగా ఇప్పటికే జనాల్లో టాక్ మొదలైంది.

తేజ్ మార్ని దర్శకత్వం లో ఈ రీమేక్ రూపొందుతోంది. ప్రస్తుతానికి సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇదే ఏడాది లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గీతా ఆర్ట్స్ వారు ప్రయత్నాలు చేస్తున్నారట. ఒరిజినల్ వర్షన్‌ కు తెలుగు టచ్ ఇచ్చి రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.