ముఖమంతా గడ్డం ఉండేవాడు హీరోనా? కోట ప్రశ్న!
టాలీవుడ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు. నవరసాల్ని అలవోకగా పోషించే గ్రేట్ ఆర్టిస్టు. అందుకే కోట అంటే తెలుగువారికి ఎనలేని గౌరవం.
By: Tupaki Desk | 14 July 2025 5:00 AM ISTటాలీవుడ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు కోట శ్రీనివాసరావు. నవరసాల్ని అలవోకగా పోషించే గ్రేట్ ఆర్టిస్టు. అందుకే కోట అంటే తెలుగువారికి ఎనలేని గౌరవం. విలనీకి రావు గోపాల్ రావు తర్వాత అంతటి అర్థం చెప్పిన మహానటుడు ఆయన. ఇక విమర్శించడంలోను ఆయన వెనకాడని నైజం చాలా చిక్కులే తెచ్చి పెట్టేది. ఉన్న మాటను ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా మాట్లాడుతూ నిరంతరం చర్చల్లో నిలిచేవారు ఆయన. పరభాషా నటుల ప్రాపకాన్ని సహించలేని కోట దానిపై పలుమార్లు విరుచుకుపడిన సంగతిని ఎవరూ మర్చిపోరు.
అంతేకాదు.. మోడ్రన్ సినిమాల్లో కుప్పిగంతులు.. ఆర్టిస్టుల వెకిలితనాన్ని ఆయన తనదైన శైలిలో విమర్శిస్తుంటే చాదస్తం కోట అని అన్నవాళ్లు.. ఉడుక్కునేవాళ్లకు కొదవేం లేదు. నాటి సినిమాల సెట్స్‌లో ఉండే వాతావరణ ఇప్పుడు లేదని దర్శకనిర్మాతల్ని, తోటి ఆర్టిస్టుల్ని ఆయన చురకలు వేయడంతో ఈ పేరొచ్చిందేమో బహుశా. ఏదేమైనా వందలాది చిత్రాల్లో నటించిన కోట ఇతరులతో పోటిస్తే ఎంతో విలక్షణుడు. హీరోయిన్ ముందు హీరో కోతిలా గెంతుతూ ఉంటాడు.
కిందపడి గిలగిల కొట్టుకుంటుంటాడు. అదేం డాన్స్ అంటే.. ఫ్లోర్ డ్యాన్సులంటారు. మామూలుగా మన ఇళ్ళల్లో అమ్మాయిల ముందు అబ్బాయిలు గెంతుతారా.. గెంతరు కదా. పద్ధతిగా.. హుందాగా నడుచుకుంటారు. కానీ సినిమాల్లో అలా ఎందుకుంటారో? అలాగే ప్రతి పాటకూ బ్యాగ్రౌండ్లో 50 మంది డ్యాన్సర్లుంటారు. ఇంతమంది అవసరమా అనిపిస్తుంది. గత సినిమాలలో హీరో జైలుకెళితే మాసిన గడ్డంతో దర్శకులు చూపించేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ గడ్డంతో కనిపిస్తున్నారు. ముఖమంతా గడ్డముంటే హీరో ఎలా అవుతాడు? అని చురకలు వేశారాయన. ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో.
కెరీర్ ఆరంభం కోట జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. రావుగోపాల్రావ్ తర్వాత అంతటి ఛరిష్మా ఆయనకు ఉంది. అవార్డుల్లోనూ ఆయనకు జరిగిన అన్యాయాలున్నాయి. రంగ స్థల కళాకారుడిగా .. సినీనటుడిగా ఆయనకు అసాధారణ అనుభవాలున్నాయి.
