Begin typing your search above and press return to search.

కొరటాలని వదలని శ్రీమంతుడు వివాదం..!

తాజాగా కొరటాల శివ చేసిన పిటీషన్ పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు విచారణ నిర్వహించారు.

By:  Tupaki Desk   |   29 Jan 2024 12:22 PM GMT
కొరటాలని వదలని శ్రీమంతుడు వివాదం..!
X

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా 2015లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. మహేష్ శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మించారు. ఆ బ్యానర్ తొలి సినిమా అదే కావడం విశేషం. అయితే శ్రీమంతుడు సినిమా కథ విషయంలో రైటర్ శరత్ చంద్ర ఆ కథ తనదే అంటూ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. స్వాతి పత్రికలో తను రాసిన చచ్చేంత ప్రేమ కథను కాపీ చేశారని ఫిర్యాధులో పేర్కొన్నాడు. శరత్ చంద్ర పిటీషన్ ని విచారించిన కోర్టు డైరెక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

నాంపలి కోర్ట్ ఆదేశాలను తిప్పికొడుతూ దర్శకుడు కొరటాల శివ తెలంగాణా హైకోర్టును ఆశ్రయించారు. కథ కాపీ అనే ఆధారాలను విచారణ టైంలో రైటర్ శరత్ చంద్ర కోర్టుకు సమర్పించారు. శరత్ చంద్ర ఆరోపణ నిజమేనని.. రచయితల సంఘం ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు నాంపల్లి కోర్టు తీర్పుని సమర్ధించింది. అప్పుడు కొరటాల శివ సుప్రీంకోర్టుకి వెళ్లారు.

తాజాగా కొరటాల శివ చేసిన పిటీషన్ పై జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలు విచారణ నిర్వహించారు. ఫైనల్ గా రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థానిక నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చిందని.. అంతేకాదు అందులో స్పష్టమైన అంశాలు పొందుపరిచారని సుప్రీం కోర్ట్ పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తం లో కొరటాల శివ శరత్ చంద్ర కథను కాపీ కొట్టాడనే బలంగా చెబుతున్నాయి.

స్వతహాగా కథా రచయిత అయిన కొరటాల శివ ఇలా ఒకరి కథను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీస్తాడని అనుకోలేం. కానీ శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమ కథ మూలం చేసుకుని కథనం మార్చి కొరటాల శివ శ్రీమంతుడు తీశాడని ఆ రైటర్ కేసు వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆయనకు షాక్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. మరి ఈ విషయంపై కొరటాల శివ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కొరటాల శివ తెరకెక్కించిన శ్రీమంతుడు సినిమాపై సుప్రీం కోర్ట్ డైరెక్టర్ కి షాక్ ఇస్తూ తీర్పు ఇచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక 8 నెలలకు శరత్ చంద్ర కాపీ వివాదం లేవనెత్తగా ధర్మాసనం శరత్ చంద్ర కథనే కొరటాల శివ కాపీ కొట్టాడనే స్పష్టం చేసింది. శ్రీమంతుడు తర్వాత మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేశారు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల శివ ఎన్.టి.ఆర్ హీరోగా దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కొరటాల శివకు శ్రీమంతుడు కేసు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు.