Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ మెట్టు దిగ‌డం క‌ష్ట‌మే?

భారీ ప్రాజెక్ట్‌లు, స్టార్‌డ‌మ్ కొన్ని సందర్భాల్లో చెప్పుకోవ‌డానికి బాగానే ఉంటుంది కానీ కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం అదే శాపంగా మారి కెరీర్‌ని ఇర‌కాటంలోకి నెట్టేస్తుంటుంది.

By:  Ravindar Gorantla   |   23 March 2026 6:00 PM IST
స్టార్ డైరెక్ట‌ర్ మెట్టు దిగ‌డం క‌ష్ట‌మే?
X

భారీ ప్రాజెక్ట్‌లు, స్టార్‌డ‌మ్ కొన్ని సందర్భాల్లో చెప్పుకోవ‌డానికి బాగానే ఉంటుంది కానీ కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం అదే శాపంగా మారి కెరీర్‌ని ఇర‌కాటంలోకి నెట్టేస్తుంటుంది. ద‌క్కించుకున్న స్టార్ డ‌మ్‌కు త‌గ్గ‌ట్టుగా ఉండ‌లేక‌..దాన్ని కాద‌ని కిందికి దిగ‌లేక చాలా మంది స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని స్టార్ డైరెక్ట‌ర్ ఎదుర్కొంటున్నారా?.. ఎటు వైపుకి వెళ్లాలో డిసైడ్ చేసుకోలేక‌పోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

ఆ స్టార్ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు కొర‌టాల శివ‌. `మిర్చి` నుంచి `భ‌ర‌త్ అనే నేను` వ‌రకు వ‌రుస స‌క్సెస్‌లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని త‌న ఖాతాలో వేసుకుని అప్ప‌టి వ‌రకు అప‌జ‌య‌మెరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న కొర‌టాల శివ `ఆచార్య‌`తో ఒక్క‌సారిగా డిజాస్ట‌ర్‌ని ఎదుర్కొని షాక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల తొలి కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై డిజాస్ట‌ర్ అనిపించుకుంది. అప‌జ‌యాలే ఎరుగ‌ని డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న కొర‌టాల‌కు షాక్ ఇచ్చింది.

అయితే దీని త‌రువాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో చేసిన `దేవ‌ర‌` మంచి విజ‌యాన్ని సాధించిన ఊర‌ట‌నిచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకోలేక‌పోయింది. దీంతో ఎలాగైనా దీనికి సీక్వెల్‌గా చేయ‌నున్న `దేవ‌ర 2`ని భారీ స్థాయిలో చేయాల‌ని, ఈ స్టోరీతో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌ని కొర‌టాల శివ గ‌త రెండేళ్లుగా శ్ర‌మిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తుండ‌టంతో ఈ సీక్వెల్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

ఎన్టీఆర్ `వార్ 2` త‌రువాత ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో భారీ పాన్ ఇండియా మూవీ `డ్రాగ‌న్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది పూర్త‌యితే కానీ ఎన్టీఆర్ `దేవ‌ర 2`కు డేట్స్ ఇచ్చే అవ‌కాశం లేదు. అదీ కాకుండా `డ్రాగ‌న్‌` షూటింగ్ పూర్త‌యిన త‌రువాత కొంత విరామం తీసుకున్నాకే ఎన్టీఆర్ `దేవ‌ర 2` కోసం డేట్స్ కేటాయించే అవ‌కాశం ఉంది. అంటే ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్ల‌కు పైనే ఎదురు చూసిన కొర‌టాల మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

అయితే ఎన్టీఆర్ కోసం మ‌రి కొన్ని నెల‌లు ఎదురు చూడ‌క‌త‌ప్ప‌ద‌ని గ్ర‌హించిన కొర‌టాల ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ‌ల‌తో సినిమాలు చేయాల‌ని వారికి స్టోరీలు వినిపించాడ‌ట‌. ఇద్ద‌రూ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డంతో యంగ్ హీరోల‌తో అయినా వ‌ర్క‌వుట్ చేస్తారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. కానీ కొర‌టాల శివ మాత్రం ఎన్టీఆర్ కోసం ఎన్ని నెల‌లైనా ఎదురు చూస్తానే కానీ యంగ్ హీరోల‌తో మెట్టుదిగి సినిమాలు చేయ‌న‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఇలా ఏళ్ల‌కు ఏళ్లు ఓ ప్రాజెక్ట్ కోసం నిరీక్షించ‌డం త‌న‌కే న‌ష్ట‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.