ఆ నమ్మకంతోనే కొరటాల ల కొత్త హీరోని ట్రై చేయలేదా?
'దేవర' తర్వాత కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ ఏంటి? అంటే 'దేవర -2' మాత్రమే.
By: Tupaki Desk | 1 July 2025 12:02 PM IST'దేవర' తర్వాత కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ ఏంటి? అంటే 'దేవర -2' మాత్రమే. ఈ విషయంలో కొరటాల క్లియర్ గా ఉన్నారు. 'దేవర'- 'దేవర 2' మధ్య మరో సినిమా చేస్తానని కొరటాల ఏ సందర్భంలోనూ చెప్పలేదు. అయితే 'దేవర' అనంతరంమే 'దేవర 2' ఉంటుందనుకున్నారంతా. ఇదంతా ప్రేక్షకుల ఊహ మాత్రమే. కొరటాల లాజిక్ ప్రకారం 'దేవర' తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ డ్రాగన్ చేస్తాడు. ఇది ఓ ఆర్డర్ ప్రకారం వెళ్తుంది.
సడెన్ గా డ్రాగన్ తెరపైకి రావడంతో 'దేవర2' ఉందనే ప్రచారం జరిగింది. ఎందుకంటే 'దేవర' కు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో 'దేవర 2' ఉండదని ప్రచారం జరిగింది. కానీ ఆ విషయాన్ని కొరటాల కంటే ముందుగా ఎన్టీఆర్ ఖండించాడు. 'డ్రాగన్' తర్వాత మొదలయ్యే సినిమా 'దేవర 2'గా క్లారిటీ ఇచ్చారు. ఇక కొరాటాల తాను చేయాల్సిందల్లా చేస్తున్నాడు. 'దేవర 2' తో మొదటి భాగంపై వచ్చిన అన్ని లెక్కలు సరిచేసేలా స్క్రిప్ట్ ని తీర్చిదిద్దుతున్నాడు.
ముందే స్క్రిప్ట్ రెడీ అయినా ఇప్పుడా కథకు మెరుగులు దిద్దుతున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అన్నది అందరిలో ఉన్న అతి పెద్ద సందేహం. 'డ్రాగన్' వచ్చే ఏడాది మిడ్ లో రిలీజ్ అవుతుందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం జరిగితే ఇబ్బంది లేదు. కొరటాలకు సమయం వృద్దా కాదు. కానీ అప్పటికీ రిలీజ్ కాకపోతే కొంత సమయం వృద్ధా తప్పదు.
కాగా ఇక్కడ మరో విషయం కూడా తెరపైకి వస్తుంది. 'డ్రాగన్' షూటింగ్ ఓ కొలిక్కి రాగానే తారక్ 'దేవర 2' కి డేట్లు ఇచ్చేస్తాడని తాజాగా వినిపిస్తోంది. డిసెంబర్ నుంచి ఆయన డేట్లు ఇచ్చే అవకాశం ఉందని ప్రచా రంలో ఉంది. ఆ నమ్మకంతోనే కొరటాల కూడా మరో హీరో కోసం ప్రయత్నించడం లేదన్నది తాజా సమాచారం.
