Begin typing your search above and press return to search.

నిర్మాణానికి దూరంగా మెగా బ్యాన‌ర్!

మెగా బ్యాన‌ర్ నిర్మాణానికి దూరంగా ఉందా? ఆ సంస్థ నుంచి సినిమా రిలీజ్ అయి మూడేళ్లు గ‌డుస్తుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   28 April 2025 8:30 AM IST
Konidela Banner Shuts Down ?
X

మెగా బ్యాన‌ర్ నిర్మాణానికి దూరంగా ఉందా? ఆ సంస్థ నుంచి సినిమా రిలీజ్ అయి మూడేళ్లు గ‌డుస్తుందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. 2017 లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీని స్థాపించిన సంగ‌తి తెలిసిందే. తొలి ప్ర‌య‌త్నంగా మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ చిత్రం `ఖైదీ నెంబ‌ర్ 150` నిర్మించారు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. నెంబ‌ర్ త‌గ్గ‌ట్టే ఆ సినిమా 150 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది.

కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ తొలి సినిమాతోనే గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. మ‌ళ్లీ రెండేళ్ల త‌ర్వాత‌ చిరంజీవి హీరోగానే `సైరా న‌రసింహారెడ్డి` చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. స్వాత్రంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల వాడ న‌ర‌సింహారెడ్డిని క‌థ‌ను 200 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. కానీ ఆ సినిమా అంచ‌నాలు అందుకో లేక‌పోయింది. దీంతో కొంత న‌ష్టం త‌ప్ప‌లేదు. అటుపై మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ చిరు హీరోగానే `ఆచార్య` చిత్రాన్మి నిర్మించారు.

ఈ సినిమా కూడా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోలేక‌పోయింది. ఈ సినిమా 2022లో రిలీజ్ అయింది. అదే ఏడాది మ‌ల‌యాళం హిట్ సినిమాకు రీమేక్ గా `గాడ్ ఫాద‌ర్` చిత్రాన్ని నిర్మించారు. ఇది డివైడ్ టాక్ తో ఆడింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇంత వ‌ర‌కూ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీలో కొత్త చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు. అంటే దాదాపు మూడేళ్ల‌గా కొణిదెల కంపెనీ నిర్మాణానికి దూరంగా ఉన్న‌ట్లే క‌నిపిస్తుంది.

ఈ బ్యాన‌ర్లో కేవ‌లం చిరంజీవి మాత్ర‌మే న‌టించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఇంకా అందులో భాగ మ‌వ్వ‌లేదు. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా న‌టించలేదు. ఇంకా మెగా మేన‌ల్లుళ్లు సాయితేజ్ , వైష్ణ‌వ్ తేజ్.... అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఉన్నారు. వాళ్ల‌తో కూడా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఎలాంటి సినిమా ఆలోచన చేస్తున్న‌ట్లు క‌నిపించ‌లేదు. అలా స‌ద‌రు నిర్మాణ సంస్థ స్లీప్ మోడ్ లో ఉంది.