Begin typing your search above and press return to search.

సల్మాన్ మూవీ సీక్వెల్.. రంగంలోకి తెలుగు డైరెక్టర్..

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుండగా.. నో ఎంట్రీిి సినిమాకు కూడా సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 May 2025 8:20 AM
సల్మాన్ మూవీ సీక్వెల్.. రంగంలోకి తెలుగు డైరెక్టర్..
X

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుండగా.. నో ఎంట్రీిి సినిమాకు కూడా సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఆ సినిమా.. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఆ మూవీని బోనీ కపూర్ రూపొందించారు.

ఆ తర్వాత నో ఎంట్రీకి సీక్వెల్ ఉంటుందని కొద్ది రోజుల క్రితం అనౌన్స్ చేశారు. రెండో భాగంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జిత్ దోసాంజ్.. లీడ్ రోల్స్ లో నటిస్తున్నట్లు ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే సూపర్ హిట్ మూవీ కనుక అంచనాలు ఉండగా.. వాటిని మేకర్స్ సరైన రీతిలో నిలబెట్టుకోలేదని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఎందుకంటే మేకర్స్.. అనౌన్స్మెంట్ తర్వాత ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దానికి తోడు స్టార్ క్యాస్టింగ్ సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ ప్రాజెక్టులో లేరు. సీక్వెల్ కోసం సెలెక్ట్ చేసిన దిల్జిత్ దోసాంజ్ కూడా ఇటీవల తన బిజీ షెడ్యూల్ వల్ల సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మూవీపై బజ్ బాగా తగ్గినట్లు సమాచారం.

అదే సమయంలో ఇప్పుడు మేకర్స్.. మూవీపై మళ్లీ బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ చేయడానికి టాలీవుడ్ రైటర్ కోన వెంకట్ ను రంగంలోకి దించుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మేకర్స్.. ఆయనను సంప్రదించారని.. త్వరలోనే ఆన్ బోర్డులోకి రానున్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే అల్లుడు శీను, దూకుడు, వెంకటేష్, వెంకీ వంటి పలు చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్నారు కోన వెంకట్. తన వర్క్ తో తెలుగు సినీ ప్రియులను అలరించారు. దీంతో ఇప్పుడు ఆయనను టీమ్ లోకి తీసుకోవడంతో అంచనాలు మళ్లీ రీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. నిర్మాత బోనీ కపూర్, డైరెక్టర్ బాజ్మీ కూడా నమ్మకాలు పెట్టుకోవచ్చు.

ఇక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నాను ఫస్ట్ హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెండో హీరోయిన్ ను అదితీ రావు హైదరీని ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి మూవీని తీసుకెళ్లనున్నట్లు వినికిడి. ఆ తర్వాత వరుస అప్డేట్స్ ఇవ్వనున్నారట. మరి చూడాలి మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో..