ఎన్టీఆర్ మాటలతో చాలా రిలీఫ్ వచ్చింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్ క్రేజ్, ఫాలోయింగ్ ఈ మధ్య విపరీతంగా పెరిగాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది
By: Tupaki Desk | 15 May 2025 12:30 AMమ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్ క్రేజ్, ఫాలోయింగ్ ఈ మధ్య విపరీతంగా పెరిగాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. దీంతో తన సినిమా రిలీజవుతుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. థియేటర్లు ఫ్యాన్స్ చేసే హడావిడితో దద్దరిల్లిపోతున్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ కు, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఉన్నట్టే ఆయన చెప్పే స్పీచులు, ఆయన మాట్లాడే మాటలకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.
అవును. ఎన్టీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడే మాటలు, చేసే ప్రసంగాలు రియల్ లైఫ్ కు ఎంతో దగ్గరగా, రియాలిటీతో ముడిపడి ఉండటంతో ఆయన స్పీచులకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆ ఫ్యాన్స్ లో నార్మల్ ఆడియన్స్ తో పాటూ ఓ హీరోయిన్ కూడా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఆమె మరెవరో కాదు, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కోమలీ ప్రసాద్. 2016 లో నేను సీతాదేవి అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కోమలీ ప్రసాద్ ఆ తర్వాత అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, సెబాస్టియన్, రౌడీ బాయ్స్, నెపోలియన్, హిట్2 సినిమాలతో పాటూ రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన హిట్3 లో కూడా నటించి బాగా ఫేమస్ అయింది.
హిట్3 లో వర్షగా కనిపించి అందరినీ మెప్పించిన కోమలి ప్రసాద్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తండ్రి చనిపోయి ఎంతో బాధలో ఉన్న టైమ్ లో తాను ఎన్టీఆర్ మాటల్ని విన్నానని, ఆ మాటలు విన్నాక తనకెంతో కంఫర్ట్ అనిపించిందని, ఆ తర్వాత ఆయన సినిమాలన్నీ చూసి, ఆయనపై అభిమానం, ప్రేమ పెరిగాయని, ఇప్పుడు ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ ను అని కోమలి చెప్పుకొచ్చింది.