మాస్టర్ అప్లికేషన్ చింపేసి మరీ ఇండస్ట్రీలోకి వచ్చా
డాక్టర్ అవాల్సిన వాళ్లు యాక్టర్ అయ్యారన్నట్టు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది డాక్టర్లే ఉన్నారు.
By: Tupaki Desk | 8 May 2025 4:49 PMడాక్టర్ అవాల్సిన వాళ్లు యాక్టర్ అయ్యారన్నట్టు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది డాక్టర్లే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లుగా నటిస్తున్న కొంతమంది భామలు ఇండస్ట్రీలోకి రాకముందు డాక్టర్లుగా పని చేశారు. కొందరు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో చదువుని మధ్యలో ఆపేసి సినిమాలు చేస్తుంటే మరికొందరు మాత్రం ఓ వైపు చదువుతూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా పలు సినిమాలు చేసి సత్తా చాటిన సాయి పల్లవి, శ్రీలీల, మీనాక్షి చౌదరి, కామాక్షి భాస్కర్ల డాక్టర్లనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది. ఆమె మరెవరో కాదు, కోమలి ప్రసాద్. ఇప్పుడిప్పుడే కోమలి టాలీవుడ్ లో బిజీ అవుతుంది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు, సిరీస్ లు చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది కోమలి.
రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హిట్3 సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించిన కోమలి ప్రసాద్ హిట్2 లో కూడా నటించింది. హిట్2, హిట్3 సినిమాలతో కోమలి క్రేజ్, ఫాలోయింగ్ బాగా పెరిగాయి. హిట్3 ప్రమోషన్స్ లో భాగంగా కోమలి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
డాక్టర్ గా స్టడీస్ పూర్తయ్యాక డెంటిస్ట్ గా వర్క్ చేశానని, సినిమాల్లోకి వెళ్తానంటే తన తండ్రి ఒప్పుకోలేదని, డాక్టర్ సర్టిఫికెట్ చేతికి వచ్చాకే ఏదైనా చేయమన్నారని, చేతిలో డిగ్రీ ఉంటే లైఫ్ సేఫ్ గా ఉంటుందని, ఆ కారణంతోనే ఇండస్ట్రీలోకి లేట్ గా వచ్చానని చెప్పిన కోమలి న్యూయార్క్ వెళ్లి మాస్టర్స్ చేద్దామనుకున్నానని, అప్పుడే నేను సీతా దేవి మూవీ ఆఫర్ వచ్చిందని, యాక్ట్ చేస్తావా అనగానే మాస్టర్స్ అప్లికేషన్ ను చింపేసి మరీ సినిమాల్లోకి వచ్చానని ఎవరికీ తెలియని విషయాలను బయట పెట్టింది కోమలి. అమ్మడు డాక్టరే కాదు క్లాసికల్ డ్యాన్సర్ కూడా.