Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ని టచ్ చేయాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలే?

టాలీవుడ్ ని ట‌చ్ చేయాల‌ని కోలీవుడ్ సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోందా? అందులో మ‌ణిర‌త్నం లాంటి స్టార్ మేక‌ర్ ముందు వ‌రుస‌లో ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   13 Nov 2023 3:00 AM GMT
టాలీవుడ్ ని టచ్ చేయాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాలే?
X

టాలీవుడ్ ని ట‌చ్ చేయాల‌ని కోలీవుడ్ సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తోందా? అందులో మ‌ణిర‌త్నం లాంటి స్టార్ మేక‌ర్ ముందు వ‌రుస‌లో ఉన్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు సినిమా స్థాయి ఏంటి? ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్'..'పుష్ప‌'..'కార్తికేయ‌-2' లాంటి చిత్రాలు పాన్ ఇండియాని షేక్ చేసే స‌రికి టాలీవుడ్ తారా స్థాయిలో నిల‌బ‌డింది. బాలీవుడ్ ని సైతం వెన‌క్కి నెట్టి నెంబ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకుంది.

దీంతో కోలీవుడ్ హీరోలే టాలీవుడ్ వైపు చూడ‌టం మొద‌లు పెట్టారు. హైద‌రాబాద్ కి త‌మ డ‌బ్బింగ్ సినిమా ప్ర‌చారం చేయ‌డానికి కూడా రాని హీరోలు తెలుగు సినిమాలు..తెలుగు ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌తో క‌లిసి ప‌నిచేయ‌డానికి క్యూ క‌ట్టారు. వాళ్ల‌తో పాటు ఛాన్సిస్తే మేము కూడా రెడీ అంటూ బాలీవుడ్ హీరోలు కూడా లైన్ లో ఉన్నారు. మ‌రోవైపు 2024 లోనైనా తిరిగి త‌మ‌స్థానం తాము ద‌క్కించుకోవాల‌ని ఓ వైపు హిందీ ప‌రిశ్ర‌మ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో కోలీవుడ్ ఇప్పుడు అస్తిత్వాన్ని చాటుకునే ప్ర‌య‌త్నంతో పాటు...కుదిరితే టాలీవుడ్ నే ప‌క్క‌కు నెట్టి రేసులో తాముండాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు షురూ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. మ‌ణి ర‌త్నం మ‌రోసారి ప‌దునైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న వైనం చూస్తేనే స‌న్నివేశం అర్ద‌మ‌వు తుంది. అంత‌కు ముందు వ‌ర‌కూ రొమాంటిక్ ల‌వ్ స్టోరీలు..చిన్న హీరోల‌తో సినిమాలు చేసిన‌ మ‌ణిర‌త్నం చ‌రిత్ర‌ల్ని తవ్వ‌డం మొద‌లు పెట్టారు. ' పొన్నియ‌న్ సెల్వ‌న్' తో మంచి విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఆ సినిమా బాక్సాపీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాలు సాధించింది. ఇటీవ‌లే విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ తో 'థ‌గ్ లైఫ్' ని ప్ర‌క‌టించారు. దాదాపు 36 ఏళ్ల త‌ర్వాత ఈ కాంబినేష‌న్ చేతులు క‌లుపుతుంది. ఈ ద్వ‌యం ఇండియాని షేక్ చేసే సినిమాతో రాబోతున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతుంది. మ‌ణిర‌త్నం ఈజ్ బ్యాక్ అనిపించేలా భారీ ఎత్తున ఆయ‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు ఉన్నాయంటున్నారు. లొకేష్ క‌న‌గ‌రాజ్.. నెల్స‌న్ దిలీప్ దిలీప కుమార్ లాంటి వాళ్లు స‌రైన కంటెంట్ తో పాన్ ఇండియాని షేక్ చేస్తున్నారు. ఇలా పాత త‌రం..కొత్త త‌రం క‌లిసి టాలీవుడ్ పై ఎలాగైనా దండెత్తాల‌ని వ్యూహాత్మ‌కంగా ముందుకు క‌దులుతు న్న‌ట్లు తెలుస్తోంది.