Begin typing your search above and press return to search.

ఒకేసారి రెండు సీక్వల్స్.. కోలీవుడ్ స్టార్ బిగ్ ప్లాన్..!

ప్రస్తుతం కార్తీ కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

By:  Tupaki Desk   |   25 April 2024 4:00 AM GMT
ఒకేసారి రెండు సీక్వల్స్.. కోలీవుడ్ స్టార్ బిగ్ ప్లాన్..!
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ కూడా స్టార్ హీరోగా కెరీర్ నిలబెట్టుకున్నాడు. సూర్య ని స్పూర్తిగా తీసుకుని వెరైటీ కథలు.. విలక్షణ పాత్రలతో కార్తీ కూడా అదరగొట్టేస్తున్నాడు. మన పక్కింటి అబ్బాయిలా ఉండే ఫీచర్స్ వల్ల తెలుగు ఆడియన్స్ కు కార్తీ దగ్గరయ్యాడు. సూర్య కన్నా కార్తీ తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు అది అతనిలో ప్లస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం కార్తీ కోలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన సినిమాల సీక్వల్స్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు కార్తి.


రెండేళ్ల క్రితం వచ్చిన కార్తీ సర్ధార్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. పి.ఎస్ మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్దార్ సినిమా ఆడియన్స్ చేత మెప్పు పొందింది. సర్దార్ కథ కథనాలు ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాయి. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సినిమా సీక్వల్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే సర్దార్ సీక్వల్ పనులు మొదలు పెట్టారు పి.ఎస్ మిత్రన్. ఇప్పటికే సర్ధార్ 2 కథ సిద్ధం కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

మే లో సర్దార్ 2 షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఇక సర్ధార్ సీక్వెల్ తో పాటుగా కార్తీ ఖైదీ 2 ని కూడా తీసే ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోగా ఆ సినిమా తర్వాత విక్రం, లియో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజైంది.

రజినీకాంత్ కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్ కార్తీతో ఖైదీ 2 చేస్తాడని అంటున్నారు. సర్ధార్ 2 ఆ తర్వాత ఖైదీ 2 వరుస క్రేజీ సీక్వల్స్ తో కార్తీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. తప్పకుండా ఈ సీక్వల్ సినిమాలు కూడా వాటి అంచనాలకు తగినట్టుగానే ఉంటాయని చెప్పొచ్చు. కార్తీ చివరగా జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం మే అజాగన్, వా వతియారె సినిమాలు చేస్తున్నాడు. సర్ధార్ 2 కూడా త్వరలో మొదలు పెట్టి ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.