Begin typing your search above and press return to search.

కోలీవుడ్ సినిమాలు.. తెలుగులో లెక్క మారింది

తెలుగు ఆడియన్స్ భాషలతో పరిమితం లేకుండా సినిమాలని ఆదరిస్తూ ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 March 2024 4:22 AM GMT
కోలీవుడ్ సినిమాలు.. తెలుగులో లెక్క మారింది
X

తెలుగు ఆడియన్స్ భాషలతో పరిమితం లేకుండా సినిమాలని ఆదరిస్తూ ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. ఈ కారణంగా కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సీనియర్ స్టార్స్ నుంచి చియాన్ విక్రమ్, సూర్య, విశాల్, దళపతి విజయ్, అజిత్, కార్తి, ధనుష్, విజయ్ సేతుపతి, శివ కార్తికేయన్ లాంటి వారు తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.

వారి సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. తెలుగు స్టార్స్ తో సమైనమైన ఓపెనింగ్స్ కి కూడా అందుకుంటూ ఉంటాయి. అయితే తమిళ్ హీరోలకి తెలుగులో దొరికినంత ఆదరణ తెలుగు హీరోలకి తమిళంలో దొరకడం లేదు. దీనికి ఎన్నో సినిమాలు ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. గత ఏడాది రిలీజ్ అయిన వాటిలో చూసుకున్న సలార్ తెలుగులో సూపర్ హిట్ అయ్యింది.

తమిళంలో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ అందుకోడానికి ఆపసోపాలు పడింది. దసరా మూవీ తమిళ్ నేటివిటీకి దగ్గరగా ఉన్న కూడా అక్కడి ప్రేక్షకులు ఆదరించలేదు. తెలుగులో హిట్ అయిన సినిమాలు తమిళంలో మాత్రం ప్రేక్షకాదరణకి నోచుకోని సందర్భాలు చాలా ఉన్నాయి. వారు మాతృభాషకి తప్ప ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చే సినిమాలని లెక్కలోకి కూడా తీసుకోరు. అంత భాషాబేధం చూపిస్తూ ఉంటారు అనే టాక్ వస్తూ ఉంటుంది.

ఈ మధ్యకాలంలో తెలుగు ఆడియన్స్ లో కూడా తమిళ సినిమాల పట్ల వైఖరి మారినట్లు కనిపిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. లాల్ సలామ్ కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. కెప్టెన్ మిల్లర్ మూవీ తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్న తెలుగు ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక ఎక్కువ మంది చూశారు.

శివ కార్తికేయన్ అయలాన్ చిత్రాన్ని అస్సలు రిలీజ్ చేసుకోలేకపోయాడు. జిగార్తండ డబుల్ ఎక్స్ అంటూ లారెన్స్ వచ్చిన రిజల్ట్ మాత్రం డిజాస్టర్ గానే వచ్చింది. రీసెంట్ గా ట్రూ లవర్ అంటూ ఒక సినిమాని డబ్ చేసి వదిలారు. ఈ సినిమాకి ప్రమోషన్స్ గట్టిగా చేసి బేబీ లాంటి మూవీ అంటూ ఊదరగొట్టిన యూత్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళకుండా ఆగరు. అదే కథ నచ్చకపోతే ఎన్ని వందల కోట్లు పెట్టి తీసిన చూడరు. ఇది తెలుగు సినిమాలకి కూడా వర్తిస్తుందని చెప్పాలి.