Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి కోలీవుడ్ స‌వాల్!

'జైల‌ర్' మాత్రం తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇక్క‌డ నుంచి కూడా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది

By:  Tupaki Desk   |   7 April 2024 3:30 PM GMT
టాలీవుడ్ కి కోలీవుడ్ స‌వాల్!
X

టాలీవుడ్ కి కోలీవుడ్ స‌వాల్ విసిరిందా? పాన్ ఇండియాలో తాముసైతం ఢీ అంటున్నారా? పత్యేకంగా టాలీవుడ్ లోక‌ల్ మార్కెట్ పై కోలీవుడ్ పంచ్ ప‌డే ఛాన్స్ ఉందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తుంది. 'పొన్నియ‌న్ సెల్వ‌న్'..' జైల‌ర్'..'లియో' లాంటి సినిమాలు ఈ రెండెళ్ల కాలంలో ఎలాంటి విజ‌యాలు సాధించాయో తెలిసిందే. 'జైల‌ర్' మిన‌హా మిగ‌తా రెండు సినిమాల ప్ర‌భావం తెలుగులో పెద్ద‌గా లేదు కానీ...మిగ‌తా భాష‌ల్లో బాగానే కనెక్ట్ అయ్యాయి.

'జైల‌ర్' మాత్రం తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇక్క‌డ నుంచి కూడా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీ సినిమా తెలుగులో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. మిగతా సినిమాలు పాన్ ఇండియాలో మంచి ఫ‌లితాలు సాధించ‌డంతో అన్నిచోట్లా మంచి పేరొచ్చింది. అయితే త్వ‌ర‌లో కోలీవుడ్ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల ప్ర‌భావం టాలీవుడ్ లో బ‌లంగా ఉండే అవ‌కాశం ఉంది. ఆ వివ‌రాల్లోకి వెళ్తే సూర్య క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తోన్న పీరియాడిక్ చిత్రం 'కంగువా'. చారీత్రాత్మ‌క క‌థాంశం ఆధారంగా దీన్ని శివ తెరకెక్కిస్తున్నారు.

సినిమా నిర్మాణంలో యూవీ క్రియేష‌న్స్ భాగం కావ‌డంతో ఇక్క‌డా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. టాలీవుడ్ లో సూర్య క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు న‌టుడు కాక‌పోయినా అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఇక్క‌డ అభిమానులు అత‌న్ని ఆద‌రిస్తారు. ఈ నేప‌థ్యంలో కంగువా గ‌నుక క‌నెక్ట్ అయితే టాలీవుడ్ నుంచి భారీ వ‌సూళ్లు లాంఛ‌న‌మే. అలాగే చియాన్ విక్ర‌మ్ ప్ర‌య‌త్నాలు కొంత కాలంగా ఫెయిల‌వుతునూ ఉన్నాయి. దీంతో ఎంతో క‌సితో 'తంగ‌లాన్' చిత్రం చేస్తున్నాడు. మ‌రోసారి చియాన్ న‌ట విశ్వ‌రూపం చూపించే చిత్రంగా ప్ర‌చార చిత్రాలు సినిమాని అమాంతం పైకి లేపాయి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వ‌స్తే గ‌నుక తెలుగు రాష్ట్రాల నుంచి భారీ వ‌సూళ్లు త‌ప్ప‌వు.

ఇక విజ‌య్ కూడా టాలీవుడ్ క్రేజ్ మెరుగుప‌డుతోన్న వేళ వెంక‌ట్ ప్ర‌భు తెరెక్కిస్తోన్న 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' పై కూడా ఇక్క‌డా మంచి అంచ‌నాలు క్రియేట్ అవుతున్నాయి. విజ‌య్ పొలిటిక‌ల్ పార్టీ ప్ర‌క‌టించిన త‌ర్వాత రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావ‌డంతో ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ సినిమాలో ఎలాంటి రోల్ పోషిస్తున్నాడు? అన్న ఎగ్జైట్ మెంట్ క‌నిపిస్తుంది. ఇక జైభీమ్ తో సంచ‌ల‌నం సృష్టించిన జ్ఞాన్ వెల్ తెర‌కెక్కిస్తోన్న వెట్టాయ‌న్ పై కూడా ఇక్క‌డ అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

పైగా ఇది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో రెట్టింపు బ‌జ్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాల‌న్నీ తెలుగు నుంచి..పాన్ ఇండియా నుంచి భారీ వ‌సూళ్లు సాధిస్తే కోలీవుడ్ పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగ‌డం ఖాయం. వాటిని త‌దుప‌రి రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు క్రాక్ చేయాల్సి ఉంటుంది.