Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ-విజ‌య్-అజిత్.. పారితోషికంలో టాప్‌-1

తాజా స‌మాచారం మేర‌కు.. ఆ ముగ్గురి తదుపరి చిత్రాలకు వారి రెమ్యూనరేషన్ ల‌ను మొత్తంగా క‌లిపి చూస్తే, ఏకంగా రూ.400 కోట్ల మైలురాయిని దాటింది.

By:  Tupaki Desk   |   25 April 2024 1:30 AM GMT
ర‌జ‌నీ-విజ‌య్-అజిత్.. పారితోషికంలో టాప్‌-1
X

కోలీవుడ్‌కు ఆ ముగ్గురు మూల స్థంబాలు. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్, ద‌ళ‌పతి విజయ్, త‌ళా అజిత్ కుమార్ ఆ ముగ్గురు మాస్ లో అతిపెద్ద క్రౌడ్-పుల్లర్ లుగా ద‌శాబ్ధాలుగా కొన‌సాగుతున్నారు. ఈ ముగ్గురి పారితోషికాల గురించి నిరంత‌రం అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంటుంది. వారంతా ఒక్కో సినిమాకి భారీగా పారితోషికాలు వసూలు చేస్తున్నారు. పారితోషికంతో పాటు లాభాల్లో వాటాలు అందుకునే హీరోలుగా వారి పేర్లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు.. ఆ ముగ్గురి తదుపరి చిత్రాలకు వారి రెమ్యూనరేషన్ ల‌ను మొత్తంగా క‌లిపి చూస్తే, ఏకంగా రూ.400 కోట్ల మైలురాయిని దాటింది.

ఇండియాలో 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకునే తారలు డ‌జ‌ను పైగానే ఉన్నారు. ఆ జాబితాలో త‌మిళ స్టార్ హీరోల పేర్లు ఉన్నాయి. వీళ్ల‌లో టాప్ 3 తమిళ స్టార్లుగా ఈ ముగ్గురి పేర్లు రికార్డుల్లో నిలుస్తున్నాయి. బాక్సాఫీస్ వ‌సూళ్లు స‌హా ప్రీ-రిలీజ్ వ్యాపార ఒప్పందాలతో రిటర్న్‌లు తేగ‌ల స‌త్తా ఉన్న హీరోలుగా హామీ ఉన్నందున వారిపై పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం గురించి నిర్మాతలు పెద్ద‌గా ఆలోచించ‌రు. దానిని ఒత్తిడిగా భావించ‌రు.

తాజాగా కోలీవుడ్ మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. సూప‌ర్‌స్టార్ రజనీకాంత్ జైల‌ర్ సక్సెస్ తర్వాత త‌న పారితోషికాన్ని అమాంతం పెంచారు. త‌దుప‌రి ఆయ‌న‌ కూలీ (తలైవర్ 171) చిత్రంలో న‌టిస్తున్నారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇటీవ‌లే టైటిల్ ని ఆవిష్క‌రించ‌గా దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. దీనికి ముందే ర‌జ‌నీ వెట్టయన్‌`లో కనిపిస్తారు. ఈ చిత్రం నిజంగా ప్రత్యేకమైనది. ఇందులో రజనీ- అమితాబ్ బచ్చన్ చాలా గ్యాప్ త‌ర్వాత తిరిగి క‌లిసి ప‌ని చేస్తున్నారు.

ఈ చిత్రానికి సూపర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ తన పారితోషికంగా 140-150 కోట్లు తీసుకుంటున్నట్లు పుకారు ఉంది. అయితే లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సినిమా `కూలీ కోసం ర‌జ‌నీ పారితోషికం రేంజ్ 250-260 కోట్ల‌కు చేరుకుంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. విక్ర‌మ్, బీస్ట్ లాంటి భారీ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ క‌ల‌యికను మాస్ క్రేజీగా భావిస్తున్నారు. అందువ‌ల్ల ఈ సినిమా ప్రీబ‌జ్ స్కైలో ఉంద‌ని తెలుస్తోంది. దానికి త‌గ్గ‌ట్టే ర‌జ‌నీకాంత్ కి భారీగా పారితోషికం లాభాల్లో వాటాలు అంద‌నున్నాయ‌ని తెలిసింది. ఓవ‌రాల్ గా ర‌జ‌నీకాంత్ రెవెన్యూ ఈ ఒక్క ప్రాజెక్ట్ నుంచి 250 కోట్లు పైగా అంద‌నుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా ర‌జ‌నీకాంత్ పేరు రికార్డుల‌కెక్క‌నుంది.

దళపతి విజయ్‌ తదుపరి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌(ది గోట్)లో కనిపించనున్నారు. విజయ్ ఫుల్‌టైమ్ రాజకీయాల్లోకి రాకముందు ఇది రెండో చివరి సినిమా అని ప్ర‌చారం ఉంది. కాబట్టి ఈ మూవీ గురించి ఇప్పటికే సాలిడ్ బజ్ ఉంది. గతంలో విజయ్ తన రెమ్యునరేషన్‌గా పెద్ద మొత్తంలో పారితోషికాలు అందుకున్నారని క‌థ‌నాలొచ్చాయి. తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. త‌న పారితోషికం రేంజ్ అమాంతం పెరిగింది. ది గోట్ కోసం 200 కోట్లు అందుకుంటున్నాడని కోలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

తమిళ చిత్ర పరిశ్రమలో మాస్‌లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న త‌ళా అజిత్ కుమార్ ఇటీవల తన 63వ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ టైటిల్ ని ప్ర‌క‌టించారు. అయితే దీనికి ముందు అజిత్ తన 62వ చిత్రం అయిన `విదా ముయార్చి`లో కనిపించనున్నాడు. తాజా పుకార్ల ప్ర‌కారం.. అజిత్ ఈ చిత్రానికి 110-120 కోట్ల రెమ్యునరేషన్ లాక్ చేసార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ ముగ్గురు కోలీవుడ్ సూపర్ స్టార్స్ పారితోషికాలు కలిపితే మొత్తం 450-470 కోట్లకు చేరుకుంటోంది. ఇది నిజంగా అసాధార‌ణం అని చెప్పాలి.