Begin typing your search above and press return to search.

కోలీవుడ్ డైరెక్ట‌ర్ తో గోపీచంద్ మ‌లిలేని పోటీ!

త‌ల అజిత్ 64వ చిత్రానికి స్టార్ మేక‌ర్ వెట్రిమారన్ క‌థ వినిపించిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 4:30 PM GMT
కోలీవుడ్ డైరెక్ట‌ర్ తో గోపీచంద్ మ‌లిలేని పోటీ!
X

కోలీవుడ్ డైరెక్ట‌ర్ తో గోపీచంద్ మ‌లినేని పోటీ ప‌డుతున్నాడా? ఆ స్టార్ హీరో కోసం ఇద్ద‌రి మ‌ధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్లో స‌న్నివేశం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది. సాధార‌ణంగా ఇలాంటి పోటీ అనేది పెద్ద‌గా క‌నిపించ‌దు. ఎందుకంటే ఎవ‌రి భాష‌ల్లో వాళ్లు సినిమాలు చేసుకుంటారు. మ‌రిక్క‌డ పోటీకి తెర తీసింది ఎవ‌రు? ఆ కోలీవుడ్ ద‌ర్శ‌కుడా? టాలీవుడ్ ద‌ర్శ‌కుడా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

త‌ల అజిత్ 64వ చిత్రానికి స్టార్ మేక‌ర్ వెట్రిమారన్ క‌థ వినిపించిన‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారం సాగుతోంది. అలాగే గోపీచంద్ మ‌లినేని కూడా అజిత్ కి స్టోరీ వినిపించి క్యూలో ఉన్న‌ట్లు కొన్ని నెల‌లుగా జోరుగా వినిపి స్తోంది. మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన గోపీచంద్ క‌థ‌కి అజిత్ లాక్ అయ్యాడ‌ని ఎప్పుడైనా డేట్లు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని ఈ మ‌ధ్య‌నే ఓ క‌థ‌నం కూడా వ‌చ్చింది.

వరుస‌గా త‌మిళ మేక‌ర్స్ తో ప‌నిచేస్తోన్న అజిత్ కూడా తెలుగు దర్శ‌కుడిగా పనిచేయాల‌ని ఆస‌క్తిగా చూస్తున్న‌ట్లు వినిపించింది. ఈ నేప‌థ్యంలో గోపీచంద్ కి ఆ ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక వెట్రిమార‌న్ కోలీవుడ్ సంచ‌ల‌న చిత్రాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దర్శ‌కుడిగా ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. గుర్తుండిపోయే ఎన్నో చిత్రాలు తెర‌కెక్కించారు.

అలాంటి ద‌ర్శ‌కుడికి అజిత్ లాంటి న‌టుడు తోడైతే? బాక్సాఫీస్ వ‌ద్ద మోత ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈనేప‌థ్యంలో అజిత్ ఇద్ద‌రిలో ఏ ద‌ర్శ‌కుడికి ముందుగా డేట్లు ఇస్తారు? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. ప్ర‌స్తుతం అజిత్ ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్త‌య్యేవ‌ర‌కూ 64వ చిత్రంపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు. అజిత్..గోపీచంద్ మ‌లినేనితో ప‌నిచేస్తే గ‌నుక అది రెండు భాష‌ల్లో త‌మిళ్ తో పాటు తెలుగులోనూ తెర‌కెక్కించే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం పాన్ ఇండియాకి టాలీవుడ్ అడ్రస్ గా మారిన సంగ‌తి తెలిసిందే.