Begin typing your search above and press return to search.

అభిమానుల పెళ్లికి వాళ్లేనా..మ‌నోళ్లు వెళ్ల‌రా?

త‌మిళ‌నాడులో అభిమానుల పెళ్లిల‌లో కోలీవుడ్ స్టార్లు అటెండ్ అవ్వ‌డం అప్ప‌డప్పుడు క‌నిపిస్తుంటుంది. అభిమానుల ఆహ్వానం మేర‌కు లేదా? ఆ హీరోకి పెళ్లి చేసుకునే వ‌రుడు లేదా వ‌ధువు త‌న‌కు పెద్ద అభిమాని అయితే హీరో అందుబాటులో ఉంటే గ‌నుక త‌ప్ప‌క హాజ‌రై స‌ర్ ప్రైజ్ చేస్తుంటారు.

By:  Srikanth Kontham   |   28 Dec 2025 7:00 PM IST
అభిమానుల పెళ్లికి వాళ్లేనా..మ‌నోళ్లు వెళ్ల‌రా?
X

త‌మిళ‌నాడులో అభిమానుల పెళ్లిల‌లో కోలీవుడ్ స్టార్లు అటెండ్ అవ్వ‌డం అప్ప‌డప్పుడు క‌నిపిస్తుంటుంది. అభిమానుల ఆహ్వానం మేర‌కు లేదా? ఆ హీరోకి పెళ్లి చేసుకునే వ‌రుడు లేదా వ‌ధువు త‌న‌కు పెద్ద అభిమాని అయితే హీరో అందుబాటులో ఉంటే గ‌నుక త‌ప్ప‌క హాజ‌రై స‌ర్ ప్రైజ్ చేస్తుంటారు. నూత‌న దంప‌తుల్ని ఆశీర్వ‌దించి.. కుదిరితే అక్క‌డే భోజ‌నం చేసి కూడా వ‌స్తారు. ఈ విష‌యంలో కోలీవుడ్ స్టార్ల‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. విజ‌య్, సూర్య‌, కార్తీ, ధ‌నుష్, విశాల్, ఆర్య‌ లాంటి స్టార్లు ఈ విష‌యంలో ఎంత మాత్రం త‌గ్గ‌రు. వీరి అటెండ్ అయిన పెళ్లి వీడియోలు..ఫోటోలు చూస్తే ఆ విష‌యం క్లియ‌ర్ గా అర్ద‌మ‌వుతుంది.

ఈ సంస్కృతిని కోలీవుడ్ నుంచి మ‌రింత‌ మంది స్టార్లు అనుస‌రించాల‌ని చూస్తున్నారు. మ‌రి టాలీవుడ్ నుంచి అభిమానుల పెళ్లిళ్ల‌కు వెళ్లే హీరోలు ఎవ‌రైనా ఉన్నారా? అంటే అలాంటి స‌న్నివేశం ఇంత వ‌ర‌కూ టాలీవుడ్ చ‌రి త్ర‌లోనే లేదు. ఆ హీరోల ఫోటోలు..ప్లెక్సీలు పెళ్లి మండ‌పంలో పెట్టుకుని పెళ్లి చేసుకోవ‌డం త‌ప్ప‌..ఇక్క‌డి హీరో లెవ‌రు అలా అటెండ్ అయింది లేదు. అప్ప‌డ‌ప్పుడు ఆ హీరో ద‌గ్గ‌ర ప‌ని చేసే స్టాప్ కి సంబంధించి శుభ కార్య క్ర‌మాల్లో హాజ‌ర‌వుతుంటారు. అదీ కూడా ఎంతో ప్ర‌యివేట్ గా ఉంటుంది. ఎక్క‌డా ఎలాంటి ఫోటో బ‌య‌ట‌కు రాకుండా ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

తెలుగు హీరోలంటే కోట్లాది మంది అభిమానిస్తారు. త‌మ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే? రెండు రాష్ట్రాల్లోనూ థియేట‌ర్ల వ‌ద్ద భారీ హంగామా నెల‌కొంటుంది. సినిమా హిట్ అవ్వాల‌ని ప్ర‌త్యేక పూజ‌లు, రక్తాభిషేకాలు, పాలా భిషేకాలు నిర్వ‌హిస్తుంటారు. ఇలాంటి స‌న్నివేశాలు తెలుగు రాష్ట్రాల్లోనే క‌నిపిస్తుంటాయి. అంత‌టి అభిమానుల పెళ్లికి మ‌న తార‌లు ఎందుకు అటెండ్ అవ్వ‌రు? అన్న‌ది అది వారి వ్య‌క్తిగ‌త విషయం. కానీ అభిమానంతో అటెండ్ అవ్వాల‌నుకున్నా? అదంత సుల‌భం కాదు. కోలీవుడ్ హీరోలు అటెండ్ అయినంత ఈజీగా టాలీవుడ్ స్టార్లు అటెండ్ కాలేరు.

కోలీవుడ్ స్టార్లు అటెండ్ అయిన స‌మ‌యంలో ఇంత వ‌ర‌కూ ఎలాంటి అంవాఛ‌నీయ సంఘ‌ట‌లు చోటు చేసుకోలేదు. ఎలాంటి హ‌డావుడి లేకుండా సింపుల్ గా తెల్ల పంచె చొక్కా ధ‌రించి వెళ్లొస్తారు. ఇది త‌మిళ సంప్ర‌దాయం. కానీ ఇక్క‌డ హీరో అటెండ్ అవ్వాలంటే చాలా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. హీరోకి వెళ్లాలి ఉన్నా? వెళ్ల‌లేని ప‌రిస్థుతులు అడ్డు గోడ‌గా నిలుస్తుంటాయి. మ‌రి ఇలాంటి స‌మ‌స్య‌లు తమిళ హీరోల‌కు ఎదుర‌వ్వ‌వా? అంటే ఎదుర‌వుతాయి. కానీ అటెండ్ అవుతారు. అదే త‌మిళ హీరోల ప్ర‌త్యేక‌త‌.