కోలీవుడ్ త్రయం టాలీవుడ్ లో కాకపుట్టించేలా!
కోలీవుడ్ హీరోల్లో సీనియర్లు అయిన రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత సూర్య, కార్తీ, విక్రమ్, విజయ్, ధనుష్ లాంటి ఇప్పటికే టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన నటులు.
By: Tupaki Desk | 30 March 2025 10:45 AM ISTకోలీవుడ్ హీరోల్లో సీనియర్లు అయిన రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత సూర్య, కార్తీ, విక్రమ్, విజయ్, ధనుష్ లాంటి ఇప్పటికే టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన నటులు. ధనుష్, విజయ్ లు ఇప్పటికే తెలుగు స్ట్రెయిట్ సినిమాలు కూడా చేసారు. అందులో బాగా ఫేమస్ అయింది ధనుష్. దీంతో అతడి తెలుగు సినిమాల సంఖ్య పెరుగుతుంది. `సార్` తర్వాత ప్రస్తుతం `కుభేర`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ములా దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్ లో ధనుష్ రేంజ్ మారిపోవడం ఖాయం. ఇకపై అతడి ప్రతీ సినిమా తమిళ్ లో పాటు తెలుగులోనూ తీయాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో ఫేమస్ అయిన మరో తమిళ నటుడు శివ కార్తికేయన్. తమిళ అనువాద చిత్రాలతో తెలుగులో బాగా ఫేమస్ అవుతున్న నటుడు. ఇటీవల రిలీజ్ అయిన `అమరన్` సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఆర్మీ జవాన్ పాత్రలో శివ కార్తీకేయన్ కు ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు.
`అమరన్` తెలుగులోనూ మంచి వసూళ్లను సాధించింది. ఆ సినిమా 300 కోట్ల వసూళ్లలో తెలుగు వసూళ్లు కీలకమైనవే. అలాగే `లవ్ టుడే`తో ప్రదీప్ రంగనాధ్ టాలీవుడ్ లో అంతే ఫేమస్ అవుతున్నాడు. తొలి సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కావడంతో యువతకి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇటీవల రిలీజ్ అయిన `డ్రాగన్` సినిమాతో మరింత ఫేమస్ అయ్యాడు. ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించడంతో? బడా నిర్మాణ సంస్థలే అతడితో సినిమాలు చేస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ అతడితో ఓ సినిమా నిర్మిస్తోంది. మరో రెండు మూడు సంస్థలు కూడా ప్రదీప్ తో సినిమా తీయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇలా ఈ మధ్య కాలంలో ధనుష్, ప్రదీప్ రంగనాధ్, శివ కార్తికేయన్ తెలుగులో బాగా ఫేమస్ అయ్యారు. ధనుష్, శివ కార్తికేయన్ తోనూ టాలీవుడ్ డైరెక్టర్లు సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. కార్తీ, సూర్య లాంటి వారు తెలుగు సినిమాలు చేస్తామని డిలే చేస్తోన్న నేపథ్యంలో ఈ త్రయం తె రపైకి రావడం ఆసక్తికరం.
