Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : స్టైలిష్ లుక్‌లో అందాల శృతి

కమల్‌ హాసన్‌ నట వారసురాలు శృతి హాసన్‌ ఇండస్ట్రీలో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   16 April 2025 4:00 AM IST
Kollywood Actress Shruti Haasan
X

కమల్‌ హాసన్‌ నట వారసురాలు శృతి హాసన్‌ ఇండస్ట్రీలో ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. కమల్‌ కూతురు అనే బ్రాండ్ ఇమేజ్ ఆమెకు మొదటి నుంచి లేదు. సొంత ఇమేజ్‌తోనే, సొంత ప్రతిభతోనే నటిగా రాణిస్తూ, ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది. మొదటి సినిమా హిందీలో చేయడంతో పాటు, మొదటి సినిమాలోనే బికినీ ధరించడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకుంది. స్టార్‌ కిడ్స్ అంటే ఎంట్రీ మరోలా ఉంటుంది. కానీ శృతి హాసన్‌ అందరిలా కాదు. ఆమె ప్రత్యేకంగా సినిమాలు చేసింది, ప్రత్యేక పాత్రలు, ప్రత్యేక పాటల్లోనూ నటించడం ద్వారా పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది.


హిందీ సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, తమిళ్‌ భాషల్లో నటించింది. తెలుగులో ఈమె నటించిన గబ్బర్‌ సింగ్‌ సూపర్‌ హిట్‌ అయింది. పవన్ తో చేసిన ఆ సినిమా శృతి హాసన్‌కు మొదటి సూపర్‌ హిట్‌ అనే విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత బలుపు, ఎవడు, రేసు గుర్రం, శ్రీమంతుడు, క్రాక్‌ ఇలా చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా ఈమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కొన్ని సూపర్‌ హిట్‌గా నిలవగా, కొన్ని నిరాశ పరిచాయి. అయినా ఈమె కెరీర్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఐటెం సాంగ్స్‌కి సైతం భారీ పారితోషికం దక్కించుకున్న అరుదైన ఘనత ఈమెకు దక్కింది అనడంలో సందేహం లేదు.


సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 24 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న శృతి హాసన్‌ తాజాగా మరోసారి స్టైలిష్‌ అవతార్‌లో ఫోటోలను షేర్‌ చేసింది. ఇతర హీరోయిన్స్‌కి చాలా భిన్నంగా ఈమె ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోలు, వీడియోలను ఈమె షేర్‌ చేయడం కాకుండా విభిన్నంగా ఉన్న ఔట్‌ ఫిట్‌లను ఈమె ధరించి వైరల్‌ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఔట్‌ ఫిట్స్ కేవలం శృతి హాసన్‌కే సాధ్యం అంటూ చాలా మంది సెలబ్రెటీలు ముఖ్యంగా హీరోయిన్స్ అనుకుంటారు అంటే శృతి ఏ రేంజ్‌ స్టైలిష్ ఔట్‌ ఫిట్‌ను ధరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా విభిన్నమైన యాష్‌ కలర్‌ ఔట్‌ ఫిట్‌ను ధరించి, లూజ్ హెయిర్‌తో మెడలో యాష్ కలర్‌ పులి గోరును ధరించి ఉన్న శృతి హాసన్‌ స్టైల్‌ ఐకాన్‌గా కనిపిస్తుంది. సాధారణంగా హీరోయిన్స్‌ ఇలాంటి ఔట్‌ ఫిట్స్‌కి ప్రిపర్‌ చేయరు. కానీ ఈమె మాత్రం చాలా ధైర్యంగా ఇలాంటి ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్‌ ఇలాంటి ఫోటోలతో మరింతగా పెరగడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమధ్య కాలంలో తెలుగుతో పాటు, హిందీ, ఇతర భాషల్లోనూ కొత్త ప్రాజెక్ట్‌లకు కమిట్‌ అయింది.