స్టార్ హీరో తెలియదన్న విరాట్ కోహ్లీ
ఒక రాజ్యానికి రాజు అయినంత మాత్రాన పక్క రాజ్యంలో అందరూ గుర్తు పట్టాల్సిన అవసరం లేదు
By: Tupaki Desk | 20 July 2025 11:00 PM ISTఒక రాజ్యానికి రాజు అయినంత మాత్రాన పక్క రాజ్యంలో అందరూ గుర్తు పట్టాల్సిన అవసరం లేదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కొన్ని చోట్ల కనీసం గుర్తింపు ఉండదు. సోషల్ మీడియాకు, వార్తలకు, టీవీలకు దూరంగా ఉండే వారిని ప్రధాని మోడీ ఫోటో చూపించి గుర్తు పట్టగలరా అన్నా వారు గుర్తు పట్టడం కష్టం. ఒక భాషలో స్టార్ హీరో అయినంత మాత్రాన అందరూ గుర్తించడం ఖచ్చితంగా సాధ్యం కాదు. తమిళ హీరో శింబు విషయంలో అది నిజం అయింది. హీరో శింబును టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గుర్తు పట్టలేదు. శింబు తన పేరు చెప్పుకున్న సమయంలో విరాట్ కోహ్లీ ఎవడు వీడు అన్నట్లుగా ఫేస్ పెట్టాడట.. ఈ విషయాన్ని శింబు స్వయంగా చెప్పుకొచ్చాడు.
శింబు ప్రతి విషయాన్ని ఓపెన్‌గా చెప్పేస్తాడు, ప్రతి విషయంలో మొహమాటం, అనుమానం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శింబు మాట్లాడుతూ.. ఒకసారి నేను టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీని కలిశాను. ఆయనకు నా పేరు చెప్పి పరిచయం చేసుకున్నాను. అయితే ఆయన నన్ను గుర్తు పట్టనట్లుగా మొహం పెట్టారు. అంతే కాకుండా మిమ్ములను ఎప్పుడూ చూసినట్లు లేదు, మీరు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా మొహం మీదే చెప్పేశాడట. ఆ సమయంలో నన్ను నేను మరింతగా పరిచయం చేసుకోవడం ఇష్టం లేక అక్కడ నుంచి వచ్చేశాను, ఆయన నన్ను అలా చూడటం ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందని శింబు అన్నాడు.
కోహ్లీ ఒకసారి మాట్లాడుతూ నాకు నీ సింగమ్ థాన్ అనే పాట ఇష్టం అని అన్నాడు. అది నా సినిమాలోని పాట, నేను తెలియకుండా నా సినిమాలోని పాట ఎలా ఫేవరేట్ అయిందో అర్థం కాలేదని, ఇప్పటికీ నేను ఎవరు అనేది ఆయనకు తెలిసి ఉండదా అని శింబు అనుకుంటూ ఉంటాడట. నన్ను కావాలని ఆట పట్టించాడా లేదంటే నిజంగానే నన్ను గుర్తు పట్టలేదా అని శింబు ఇప్పటికీ అనుకుంటూ ఉంటాడట. విరాట్ కోహ్లీ తమిళ సినిమాలను ఎక్కువగా చేసే అవకాశం లేదు.. కనుక అతడికి శింబు ఎవరు అనేది తెలిసి ఉండదు. శింబు కోలీవుడ్‌కి మాత్రమే పరిమితం అయ్యి ఉంటాడు కనుక కోహ్లీ గుర్తు పట్టి ఉండక పోవచ్చు అనే వారు ఉన్నారు.
శింబు సినిమాల విషయానికి వస్తే చాలా నమ్మకం పెట్టుకుని చేసిన 'థగ్ లైఫ్' సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కమల్ హాసన్ వంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో కనీసం కథ విషయంలో పట్టింపు లేకుండా శింబు ఓకే చెప్పాడని తెలుస్తోంది. అంతే కాకుండా మణిరత్నం దర్శకత్వం కావడంతో శింబు థగ్ లైఫ్ సినిమా విషయంలో ఏమాత్రం అనుమానం పెట్టుకుని ఉండడు. అందుకే వెంటనే ఓకే చెప్పి ఉంటాడు. కానీ ఇలాంటి సినిమాకు, ఆ పాత్రకు శింబు ఓకే చెప్పడం ఖచ్చితంగా కెరీర్‌కి నష్టం చేకూర్చుతుంది అంటూ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే శింబు ముందు ముందు ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
