Begin typing your search above and press return to search.

మ‌త్తులో పిచ్చి ప్ర‌వ‌ర్త‌న‌.. ఈ విల‌న్ ఇక మార‌డా?

అత‌డిని స‌మీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అంద‌గా కేర‌ళ‌ పోలీసులు అరెస్ట్ చేసి ప‌లు సెక్ష‌న్ల కింద‌ కేసులు న‌మోదు చేసారు.

By:  Tupaki Desk   |   10 May 2025 9:32 AM IST
మ‌త్తులో పిచ్చి ప్ర‌వ‌ర్త‌న‌.. ఈ విల‌న్ ఇక మార‌డా?
X

అత‌డు కోలీవుడ్‌లో పాపుల‌ర్ న‌టుడు. విల‌న్ గా క్రూర‌మైన పాత్ర‌ల‌తో మెప్పించాడు. త‌మిళ అనువాదాల‌తో తెలుగులోను అత‌డు పాపులారిటీ సంపాదించుకున్నాడు. దాదాపు వంద పైగా చిత్రాల్లో న‌టించిన అత‌డి ప్ర‌వ‌ర్త‌నే విస్తుగొలుపుతుంది. అత‌డు మ‌ద్యానికి బానిస‌. ఆల్క‌హాల్ సేవ‌నం, డ్ర‌గ్స్ మ‌త్తుకు అత‌డు కొన్నేళ్లుగా అల‌వాటు ప‌డ్డాడ‌ని గ‌తంలో పోలీసులు నిర్ధారించారు. అత‌డు మ‌త్తులో ఉన్న‌ప్పుడు ఏం చేస్తాడో ఎవ‌రూ ఊహించ‌లేరు. ప‌రిస‌రాల్లో పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తాడు. స‌మీపంలోని వ్య‌క్తుల‌పై విరుచుకుప‌డతాడు. హ‌ద్దు మీరి బూతు మాట‌ల‌తో నానా యాగీ చేస్తాడు. ఒళ్లు మ‌రిచి అతడు వేసే వేషాల‌కు సంబంధించిన ఫోటోలు గ‌తంలో నెట్ లో వైర‌ల్ అయ్యాయి.

ప‌దే ప‌దే అత‌డు మ‌త్తులో జోగుతూ ర‌చ్చ చేస్తుండ‌డం.. అత‌డిపై బాధితులు ఫిర్యాదు చేయ‌డం షరామామూలుగా మారింది. ప్ర‌తిసారీ పోలీసులు వ‌స్తారు. అత‌డిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. చివ‌రికి బెయిల్ పై విడుద‌ల‌వుతుంటాడు. ఇప్పుడు కూడా అత‌డు తాను బ‌స చేసిన హోట‌ల్ లో ర‌చ్చ చేసి బుక్క‌య్యాడు.

అత‌డిని స‌మీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అంద‌గా కేర‌ళ‌ పోలీసులు అరెస్ట్ చేసి ప‌లు సెక్ష‌న్ల కింద‌ కేసులు న‌మోదు చేసారు. అయితే స‌హ‌చ‌రుడు అత‌డిని బెయిల్ పై విడిపించాడు. హోటల్ లో సిబ్బందిపై హ‌ద్దు మీరిన మైకంలో విరుచుకుప‌డ్డ అత‌డు త‌న‌ను అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చిన పోలీసుల‌పైనా దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో దానిపైనా కేసు న‌మోదు చేసార‌ని తెలుస్తోంది.

ఈ న‌టుడు ఎవ‌రు? అనేది అప్ర‌స్తుతం. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మ‌ద్యం సేవ‌నం, డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ అదుపు త‌ప్పుతున్న వైనానికి ఇది ఒక ఎగ్జాంపుల్. తాగుడు కంటే డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ప్ర‌మాద‌క‌రం. దీనిని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కొన్ని క‌మిటీలు సినీప‌రిశ్ర‌మ‌ల్లో ప‌ని చేస్తున్నా కానీ, అవేవీ ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. మ‌హిళా క‌మీష‌న్లు, మ‌హిళా ఆర్టిస్టుల‌తో క‌మిటీలు, సినీపెద్ద‌ల‌తో క‌మిటీలు ఎన్ని ఉన్నా ఇలాంటి డ్ర‌గ్స్ మ‌త్తుకు బానిసైన వారిని క‌ట్ట‌డి చేయ‌డం కుద‌ర‌డం లేదు.

దీని కోసం ప్ర‌త్యేకించి ప్ర‌భుత్వ అధికారులు రావాల్సి ఉంటుంది. అలాగే ఆన్ లొకేష‌న్ డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ని క‌ట్ట‌డి చేసేందుకు మాలీవుడ్ లో క‌మిటీలు కృషి చేస్తున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ లాంటి చోట్ల ఇవి నామ‌మాత్రంగా ఉన్నాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఈ ప‌రిస్థితి లో మార్పు రావాల‌ని ప‌లువురు కోరుకుంటున్నారు.