ఆ స్టార్ హీరో గొప్ప శివ భక్తుడు!
అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా గొప్ప శివ భక్తుడని తెలుస్తోంది. ఏటా అయ్యప్ప మాలను ధనుష్ ధరిస్తుంటాడు.
By: Tupaki Desk | 27 May 2025 3:30 PMమెగాస్టార్ చిరంజీవి అంజనేయ స్వామి భక్తుడు. ఆయన కులదైవంగా కొలుస్తారు. దీంతో రామ్ చరణ్ కూడా అంజనేయ స్వామి భక్తుడిగా మారారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లోగో కూడా అంజనే యస్వామి బొమ్మతోనే కనిపిస్తుంది. అలాగే అయ్యప్ప స్వామి కి తండ్రీకొడుకులిద్దరు గొప్ప భక్తులు. సమయం కుదిరి నప్పుడల్లా అయ్యప్ప మాల ధరిస్తుంటారు. ఇంకా చాలా మంది హీరోలు అయ్యప్ప మాల ధరించడం తరు చూ కనిస్తుంటుంది.
అలాగే కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా గొప్ప శివ భక్తుడని తెలుస్తోంది. ఏటా అయ్యప్ప మాలను ధనుష్ ధరిస్తుంటాడు. తాజాగా శివుడిని ధనుష్ ఎంతగా ఆరాదిస్తాడు? అన్నది రివీల్ చేసాడు. అదేంటో ఆయన మాటల్లోనే..' చిన్నప్పటి నుంచి శివ భక్తుడిని. అందుకు కొడుకులిద్దరు యాత్ర, లింగ అనే పేర్లు పెట్టాను. షూటింగ్ నుంచి తీరిక దొరికితే శివాలయాలన్నింటిని చుట్టేస్తాను. ముఖ్యంగా అరుణాచలం , చిదంబరం వంటి ఆలయాలకు వెళ్తుంటాను.
ఆలయాల్లో గడిపితే పాజిటివ్ ఎనర్జీ సొంతమవుతుందని నా నమ్మకం. అలాగే నా సినిమాలు విడుదలకు ముందు మా సొంతూరిలోని తేని జిల్లా మల్లింగాపురం లో కస్తూరి మంగమ్మ ఆలయానికి వెళ్తుంటా. ఇలా ఆలాయాలు తిరుగుతుంటే ఎంతో ఎనర్జీ లభిస్తుంది. మనసు ప్రశాంతంగా మైండ్ పీస్ పుల్ గా ఉంటుం ద'న్నాడు
అలాగే ధనుష్ ప్యూర్ వెజిటేరియన్. డైటింగ్ తో పాటు క్రమంతప్పకుండా వ్యాయామాలు చేస్తుంటాడు. ఈ రెండు కాకుండా శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం అంటున్నాడు. సమయం దొరికితే కంటినిండా నిద్రపోతాడుట. మానసిక ఒత్తిడిని నిద్ర ద్వారా కూడా జయించొచ్చు అంటున్నాడు.