Begin typing your search above and press return to search.

కింగ్ ఆఫ్ కోతా.. కలెక్షన్స్ అక్కడ ఓకే కానీ ఇక్కడే..

తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో ఇతర సినిమాల పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అడ్వాన్స్ బుకింగ్ కూడా అంతంతా మాత్రంగానే జరిగింది.

By:  Tupaki Desk   |   25 Aug 2023 9:19 AM GMT
కింగ్ ఆఫ్ కోతా.. కలెక్షన్స్ అక్కడ ఓకే కానీ ఇక్కడే..
X

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ కలిసి నటించిన గ్యాంగ్ స్టర్ మూవీ కింగ్ ఆఫ్ కోతా. వేఫారెర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. మలయాళం, తమిళ, తెలుగు, భాషల్లో భారీ అంచనాలతో తాజాగా ఆగస్ట్ 24న రిలీజైన ఈ చిత్రం తొలి రోజు పర్వాలేదనిపించే వసూళ్లను అందుకుంది.

40 కోట్ల బడ్జెట్ తో సినిమాను రూపొందించారని తెలిసింది. మలయాళం నుంచి తొలి పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో రికార్డు స్థాయి స్క్రీన్ కౌంట్‌తో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొచ్చారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఇక్కడ 1000 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్లు తెలిసింది.

ఈ సినిమాకు మలయాళంలో మాత్రమే భారీ ఓపెనింగ్స్ దక్కాయి. తమిళం, తెలుగులో మోస్తరు వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. టాలీవుడ్‌లో ఇతర సినిమాల పోటీ ఎక్కువగా ఉండటం వల్ల అడ్వాన్స్ బుకింగ్ కూడా అంతంతా మాత్రంగానే జరిగింది. 35 శాతం ఆక్యుపెన్సీనే నమోదైనట్లు తెలిసింది. హైదరాబాద్‌లో 40 శాతం, బెంగళూరు 45 శాతం, కాకినాడలో 40 శాతం, వైజాగ్‌లో 35 శాతం, తిరుపతిలో 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు బయట కథనాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లు ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే వసూళ్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 45 లక్షలు, సీడెడ్‌లో రూ. 15 లక్షలు, ఆంధ్రాలో రూ. 45 లక్షలు వచ్చాయి. మొత్తంగా కలిపి ఏపీ తెలంగాణలో రూ.1.05కోట్ల గ్రాస్, రూ. 55 లక్షల షేర్ వచ్చాయి. ఈ చిత్రానికి ఇక్కడ రూ.5కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అంటే బ్రేక్ ఈవెన్ 5.50కోట్లు. అంటే ఈ చిత్రానికి ఇక్కడ రూ.4,95కోట్లు వస్తేనే క్లీన్ హిట్ స్టేటస్ అందుకుంటుంది.

ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ.1.05కోట్ల గ్రాస్, రూ. 55 లక్షల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పర్వాలేదనిపించింది. దీంతో కేరాళ రూ.6.55కోట్లు, తెలుగు రూ. 1.05కోట్లు, తమిళనాడు రూ.0.40 కోట్లు, కర్నాటక రూ.0.55కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ.0.15కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.53 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తం కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 17.05 కోట్లు షేర్‌, రూ. 7.85 కోట్ల గ్రాస్ అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.40కోట్లకుపైగా బిజినెస్ చేసంది. అంటే రూ.41కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్. అంటే ఈ చిత్రానికి మరో 33.15కోట్లు వస్తే క్లీన్ హిట్ వస్తుంది.