Begin typing your search above and press return to search.

చరణ్‌ - కోహ్లీ... గాలి వార్తలే

మొత్తానికి చరణ్‌ హీరోగా కోహ్లీ బయోపిక్ అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ మెగా కాంపౌండ్ నుండి మరియు కోహ్లీ టీం నుండి క్లారిటీ వచ్చింది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 11:42 AM GMT
చరణ్‌ - కోహ్లీ... గాలి వార్తలే
X

టీం ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ బయోపిక్ త్వరలోనే అంటూ లోకల్‌ మీడియా నుండి జాతీయ మీడియా వరకు గత మూడు నాలుగు రోజులుగా కథనాలు వస్తున్నాయి. ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కోహ్లీ బయోపిక్ కు సంబంధించిన వార్తలు ప్రచురితం చేయడంతో నిజమే అని అంతా భావించారు.

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ ఈ సినిమాలో కోహ్లీ గా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు ఇలా రకరకాల చర్చలు జరిగాయి. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను మొదలు పెట్టిందని, దర్శకుడి పేరును త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని కూడా ప్రచారం జరిగింది.

కోహ్లీ గా చరణ్ నటిస్తున్నాడు అంటూ చాలా మంది నిజమే అనుకున్నారు. గతం లో కోహ్లీ బయోపిక్ లో నటించాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. అందుకే కోహ్లీ బయోపిక్ కు చరణ్ అయితే సరిగ్గా సెట్‌ అవుతాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా, లుక్స్ పరంగా కూడా చరణ్‌, కోహ్లీకి దగ్గర సంబంధాలు ఉంటాయని కొందరు అన్నారు.

మొత్తానికి చరణ్‌ హీరోగా కోహ్లీ బయోపిక్ అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ మెగా కాంపౌండ్ నుండి మరియు కోహ్లీ టీం నుండి క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు కోహ్లీ బయోపిక్ కు సంబంధించిన చర్చలు జరగలేదు అంటూ ఆయన టీమ్ మెంబర్స్ అధికారికంగా ప్రకటించారు.

చరణ్‌, కోహ్లీ సినిమా వార్తలు గాలి వార్తలే అని తెలిసి మెగా ఫ్యాన్స్ తో పాటు క్రికెట్‌ అభిమానులు అంతా కూడా ఉసూరుమంటున్నారు. అయ్యో చాలా అనుకున్నాం ఇలా జరిగిందేటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ సినిమాలో చరణ్ నటిస్తున్నాడు. ఆ తర్వాత బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ సినిమా ఉండబోతుంది.