కోహ్లి ఒక్క లైక్ తో.. ఒక్క రాత్రిలో మారిన నవనీత్ జీవితం
దీంట్లో ఒక్క పోస్టు పెట్టినా లక్షల్లో వ్యూస్.. కోట్లలో సంపాదన. ఆ మధ్య ఫాలోవర్లు, ఆదాయం విషయంలో ఇన్ స్టాలో అన్ని రికార్డులు బద్దలుకొట్టాడు కోహ్లి.
By: Tupaki Desk | 5 May 2025 4:00 PMసోషల్ మీడియాలో అత్యంత పాపులర్ ఇన్ స్టా గ్రామ్. ట్విటర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ వంటివి ఎన్ని ఉన్నా.. ఇన్ స్టా క్రేజే వేరు.. అందుకే సెలబ్రిటీలు అందరూ ఇన్ స్టా గ్రామ్ ను లైక్ చేస్తుంటారు. ఇక ఈ యాప్ లో మోస్ట్ పాపులర్ విరాట్ కోహ్లి. అతడి ఫాలోవర్ల సంఖ్య 271 మిలియన్లు. @virat.kohli. ఇదీ కోహ్లి ఇన్ స్టా ఖాతా. దీంట్లో ఒక్క పోస్టు పెట్టినా లక్షల్లో వ్యూస్.. కోట్లలో సంపాదన. ఆ మధ్య ఫాలోవర్లు, ఆదాయం విషయంలో ఇన్ స్టాలో అన్ని రికార్డులు బద్దలుకొట్టాడు కోహ్లి.
ఇక ఇటీవల కోహ్లి చేసిన చిన్న పొరపాటు లైక్.. చాలా వరకు వెళ్లింది. దానికి కారణం అవనీత్ కౌర్. సోషల్ మీడియాలో తన ఫొటో షూట్ లతో, వీడియోలతో నిత్యం హాట్ హాట్ గా కనిపించే అవనీత్ పోస్ట్ ను ఇటీవల కోహ్లి పొరపాటున లైక్ కొట్టాడు. అంతే.. ట్విటర్, ఇన్ స్టాలో నవనీత్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పైగా తాను ఎంతో ఇష్టపడే భార్య అనుష్క శర్మ పుట్టిన రోజునే కోహ్లి అనూహ్యంగా నవనీత్ పోస్ట్ కు లైక్ కొట్టాడు.
ఏం జరిగినా ఇట్టే పసిగట్టే సోషల్ మీడియా.. నవనీత్-కోహ్లి విషయాన్ని రచ్చరచ్చ చేసింది. దీంతో కోహ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే, ఇదంతా నవనీత్ కు చాలా మేలు చేసిందట.
ఇప్పుడిప్పుడే టీవీ, సినిమా రంగాల్లో పేరు తెచ్చుకుంటున్న ఆమెను బాగా పాపులర్ చేసిందట.
కోహ్లి లైక్ తో.. ఒక్క రాత్రిలో..
కోహ్లి లైక్ తో ఒక్క రాత్రిలో నవనీత్ సోషల్ మీడియా ఫేట్ మారిపోయిందట. ఎంతగా అంటే.. ఒక్క రాత్రిలో 5 లక్షల మంది ఫాలోవర్లు పెరిగేంతగానట. అడ్వర్టయిజ్ మెంట్ల కోసం కూడా క్యూలు కడుతున్నారట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో నవనీత్.. ఏకంగా తన ఇన్ స్టా పోస్టుకు తీసుకునే పారితోషికాన్ని 30 శాతం పెంచేసిందట.
నవనీత్ నికర ఆదాయం రూ.5 కోట్లు పెరిగి.. రూ.43 కోట్లకు చేరిందని కూడా సమాచారం.