Begin typing your search above and press return to search.

కాఫీ విత్ క‌ర‌ణ్ 8లో మొద‌టి ఎపిసోడ్ జంట‌

దేశంలో కాఫీ విత్ క‌ర‌ణ్ కి ఉన్న ఆద‌ర‌ణ గురించి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ టాక్ షోలలో ఇది ఒకటి. ఇప్పుడు షో 8వ‌ సీజన్ వస్తోంది

By:  Tupaki Desk   |   24 Oct 2023 6:35 AM GMT
కాఫీ విత్ క‌ర‌ణ్ 8లో మొద‌టి ఎపిసోడ్ జంట‌
X

దేశంలో కాఫీ విత్ క‌ర‌ణ్ కి ఉన్న ఆద‌ర‌ణ గురించి తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ టాక్ షోలలో ఇది ఒకటి. ఇప్పుడు షో 8వ‌ సీజన్ వస్తోంది. ఇప్పటికే డిస్నీ+హాట్‌స్టార్ కొన్ని వారాల క్రితం అధికారికంగా దీనిని ప్ర‌క‌టించింది. మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 25 అర్ధరాత్రి ( 26 అక్టోబర్, 12 ఏఎం)కి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ట్రైలర్ తాజాగా విడుద‌లైంది.

ట్రైల‌ర్ ఆద్యంతం ఫ‌న్ తో పాటు వ్య‌క్తిగ‌తంగా చాలా తెలియ‌ని విష‌యాలు రివీల‌య్యాయి. కరణ్ జోహార్ ఫేవ‌రెట్ జంట‌, బాలీవుడ్ పవర్ కపుల్ దీపికా పదుకొణె - రణవీర్ సింగ్ ఈ కార్యక్రమానికి మొదటి అతిధులుగా హాజరయ్యారు. నిజానికి ఈ జంట‌ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని రణవీర్ సింగ్ వెల్లడించడంతో ట్రైలర్ ఆసక్తిని పెంచింది. అలాగే రణ్‌వీర్ క‌ర‌ణ్‌ని టర్కీ అంకుల్ అని పిలవ‌డం ఒక ఛ‌మ‌క్కు. దీపిక మాత్రం రణవీర్ కాకుండా హృతిక్‌తో స్క్రీన్‌పై బెస్ట్ కెమిస్ట్రీ వ‌ర్క‌వుటైంద‌ని వెల్లడించింది. ఇటీవ‌లి కాలంలో దీపిక ప‌దుకొనే షారూఖ్ తోను ప‌ఠాన్ లో రొమాన్స్ చేసింది. కానీ అత‌డి పేరును సూచించ‌లేదు.

రణవీర్- దీపికా ఈ కార్యక్రమంలో కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కావ‌డంతో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఇంతకుముందు రణ్‌వీర్ - అలియా భట్, రణబీర్ కపూర్ స‌హా ఇతరులతో క‌లిసి క‌నిపించాడు కానీ దీపిక‌తో క‌నిపించ‌లేదు. దీపిక కూడా అదే విధంగా త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి క‌నిపించింది కానీ ర‌ణ‌వీర్ తో జంట‌గా క‌నిపించ‌లేదు. మొదటి ఎపిసోడ్ అనంత‌రం ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల అవుతుంది. మోస్ట్ అవైటెడ్ సీజ‌న్ ప్ర‌జ‌ల్ని అల‌రించేందుకు ఇంకెంతో స‌మ‌యం లేదు.