Begin typing your search above and press return to search.

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌గాదాలు తెచ్చేలా ఉన్నాడే!

రణ్‌వీర్‌తో పాటు తాను పనిచేసిన హాటెస్ట్ కో-స్టార్ రణబీర్ కపూర్ అని తాను నమ్ముతున్నానని దీపిక జోడించింది. అలా క‌ర‌ణ్‌..దీపిక‌..ర‌ణ‌వీర్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ సాగింది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 5:17 PM GMT
భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌గాదాలు తెచ్చేలా  ఉన్నాడే!
X

'కాఫీ విత్ క‌ర‌ణ్' టాక్ షో కొత్త సీజ‌న్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ మొద‌టి అతిధులుగా వైఫ్ అండ్ హ‌స్బెండ్ దీపికా ప‌దుకొణే-ర‌ణ‌వీర్ సింగ్ పాల్గొన్నారు. ప్రోమోలోనే టాక్ షోపై ఆద్యంతం ఆసక్తిని పెంచేసాడు క‌ర‌ణ్‌. త‌న‌దైన శైలి ప్ర‌శ్న‌ల‌తో భార్య భ‌ర్త‌లిద్ద‌ర్ని ఇర‌కాటంలో పెట్టేసాడు. మొదటి ఎపిసోడ్ ప్రోమో నుండి ఇప్పటికే కొన్ని టేక్ అవే పాయింట్‌లు క‌నిపిస్తున్నాయి. ప్రోమోలో దీపికను రణ్‌వీర్‌తో పాటు ఏ హీరోతో బెస్ట్ కెమిస్ట్రీ పంచుకుంటావ్? అని కరణ్ అడిగాడు.

దానికి దీపిక ఏమాత్రం త‌ట‌ప‌టాయించ‌కుండా బదులిస్తూ ..' అది హృతిక్ అయి ఉండాలి. నేను అతనితో ఉత్తమ కెమిస్ట్రీని పంచుకుంటాను. అత‌నితో చాలా కంప‌ర్ట్ బుల్ గా ఉంటుంది. ఇద్ద‌రం కలిసి ప‌నిచేస్తే ఆ కిక్ వేరు అంది'. దీంతో ప‌క్క‌నే హ‌బ్బీ ర‌ణ‌వీర్ సింగ్ ఒకితం ఊసురుమ‌న్నాడు. దీపిక చేసిన ఈ వ్యాఖ్యకు రణవీర్ స్పందన ఎలా ఉందంటే? 'సరే సరే.. నేను చూస్తున్నాను అంటూ దీపిక‌తో హృతిక్‌ కెమిస్ట్రీపై వినోదభరితమైన సమాధానం ఇచ్చాడు.

రణ్‌వీర్‌తో పాటు తాను పనిచేసిన హాటెస్ట్ కో-స్టార్ రణబీర్ కపూర్ అని తాను నమ్ముతున్నానని దీపిక జోడించింది. అలా క‌ర‌ణ్‌..దీపిక‌..ర‌ణ‌వీర్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ సాగింది. అది వీక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ర‌ణ‌వీర్ ఎక్క‌డైనా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌ర‌హిస్తాడు. మాట‌ల‌తోనే మాయ చేస్తాడు. అత‌డి మాట‌ల‌కు అంద‌రూ బాగా క‌నెక్ట్ అవుతుంటారు. ప్రోమోలో అదే హైలైట్ అయింది.

మొత్తానికి అంతా అనుకున్న‌ట్లే క‌ర‌ణ్ జోహార్ భార్య భ‌ర్త‌ల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌శ్న‌లే అడుగుతున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ప్రోమోలోనే ఇలా ఉందంటే? షోలో చాలా సినిమా ఉంటుంద‌ని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇలా ఇరికించే ప్ర‌శ్న‌లు చాలానే ఉంటాయ‌ని తెలుస్తుంది.

ప్ర‌స్తుతం దీపికా ప‌దుకొణే- హృతిక్ రోష‌న్ జంటగా ఫైట‌ర్ చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఇద్ద‌రి మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివే శాలు ధారాళంగానే ఉన్నాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది.