Begin typing your search above and press return to search.

ఆర్య‌న్ ఖాన్ డెబ్యూలో 'యానిమ‌ల్' విల‌న్

సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తొలి దర్శకత్వ షోలో తాను నటించనున్నట్లు బాబి డియోల్ ధృవీకరించారు

By:  Tupaki Desk   |   2 Nov 2023 8:45 AM GMT
ఆర్య‌న్ ఖాన్ డెబ్యూలో యానిమ‌ల్ విల‌న్
X

కరణ్ జోహార్ పాపులర్ చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్ 8 ఎన్నో ర‌హ‌స్యాల‌ను బ‌హిర్గ‌తం చేస్తోంది. ఈ షోలో ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త విష‌యాల‌ను, ర‌క‌ర‌కాల ర‌హ‌స్యాల‌ను కూడా ఓపెన‌వుతున్నారు. ఇప్పుడు సీజ‌న్ 8 రెండవ ఎపిసోడ్‌లో నటుడు బాబీ డియోల్ ఒక టాప్ సీక్రెట్ ని దాచుకోకుండా ఓపెన‌య్యాడు.

సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తొలి దర్శకత్వ షోలో తాను నటించనున్నట్లు బాబి డియోల్ ధృవీకరించారు. బాబీ తన సోదరుడు సన్నీ డియోల్‌తో కలిసి 'కాఫీ' సోఫాను అలంకరించాడు. KJతో సంభాషణ సందర్భంగా SRK ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ తో తనకు రిలేష‌న్ షిప్ ఉందని బాబీ వెల్లడించాడు.

నేను రెడ్ చిల్లీస్‌తో రిలేష‌న్ క‌లిగి ఉన్నాను. మొదట 'క్లాస్ ఆఫ్ 83' చేసాను. ఇప్పుడు ఆర్యన్ షో చేసాను. ఆపై నేను 'లవ్ హాస్టల్'లోను న‌టిస్తున్నాను. వారు ఎల్లప్పుడూ నాకు మంచి పాత్ర‌ల‌ను ఆఫ‌ర్ చేసారని నేను భావిస్తున్నాను అని తెలిపారు. అంతకుముందు డిసెంబర్ 2022లో ఆర్యన్ ఖాన్ తన తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ రచనను పూర్తి చేసాన‌ని వెల్లడించాడు. ఈ చిత్రానికి అతను స్వ‌యంగా దర్శకత్వం వహించబోతున్నాడు.

ఆర్యన్ దర్శకత్వం వహించిన తొలి షో గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ షోకు 'స్టార్‌డమ్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే మేకర్స్ నుండి షో స్టార్ కాస్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతంలో 2019లో షారుఖ్ ఖాన్ నేరుగా డేవిడ్ లెటర్‌మాన్ టాక్ షోలో కనిపించాడు. అక్కడ అతను తన కొడుకు ఆర్యన్ కెరీర్ ప్లాన్స్, ఆశయాల గురించి మాట్లాడాడు. ఈ షోలో ఆర్య‌న్ కి న‌టన ఇష్టం లేదని చెప్పాడ‌ని షారూఖ్ అన్నారు.

తన కొడుకు 'మంచి రచయిత' అయినప్పటికీ నటుడిగా ఉండాల్సిన అవసరం లేదని షారూఖ్ అన్నారు. ''అతనికి (ఆర్యన్) నటుడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్య‌న్ దానిని కూడా గ్రహించాడు. అత‌డు మంచి రచయిత... నటుడ‌వ్వాల‌నే కోరిక లోపల నుండి రావాలని నేను భావిస్తున్నాను. ఎవ‌రైనా నిజంగా చేయాల్సింది మిమ్మ‌ల్ని మీరు కనుగొనడం. ఆర్య‌న్ తో మాట్లాడిన‌ప్ప‌డు త‌న‌కు న‌ట‌న‌పై ఆస‌క్తి లేద‌ని అర్థ‌మైంది అని ఖాన్ తెలిపారు.

బాబీ డియోల్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల విష‌యానికి వ‌స్తే.. యాక్షన్ థ్రిల్లర్ చిత్రం యానిమల్‌లో న‌టిస్తున్నాన‌ని తెలిపారు. రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.