Begin typing your search above and press return to search.

25 ఏళ్ల క్రితం జరిగిన ఖరీదైన తప్పు..!

వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీ పెద్దగా అందుబాటులోకి రాని సమయంలోనే దర్శకుడు కోడిరామకృష్ణ అద్భుతమైన విజువల్ వండర్‌లను ఆవిష్కరించిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   12 May 2026 12:01 PM IST
25 ఏళ్ల క్రితం జరిగిన ఖరీదైన తప్పు..!
X

వీఎఫ్‌ఎక్స్‌ టెక్నాలజీ పెద్దగా అందుబాటులోకి రాని సమయంలోనే దర్శకుడు కోడిరామకృష్ణ అద్భుతమైన విజువల్ వండర్‌లను ఆవిష్కరించిన విషయం తెల్సిందే. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు గ్రాఫిక్స్ సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసేవి. బాలీవుడ్‌ సినిమాల్లో సైతం చూడని గ్రాఫిక్స్‌ను దర్శకుడు కోడిరామకృష్ణ తన సినిమాల్లో చూపించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎవర్‌ గ్రీన్‌ సినిమాల్లో 'దేవిపుత్రుడు' సినిమా ఒకటి. ఈ సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అప్పుడు సినిమా కోసం వాడిన టెక్నాలజీ, సినిమాలో చూపించిన విషయాల కారణంగా మంచి పేరు తెచ్చుకుంది. దేవి పుత్రుడు సినిమా ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలోని మ్యూజిక్‌, లవ్‌ సీన్స్‌, పాపతో ఉన్న సీన్స్, నీటిలో ఉండే సీన్స్‌, ద్వారక ఇలా ప్రతీది సినిమాకు చాలా స్పెషల్‌గా నిలిచింది.

నిర్మాత ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ...

ఇండియన్‌ సినీ చరిత్రలోనే అలాంటి సబ్జెక్ట్‌ను తీసుకుని వచ్చిన సినిమాలు అప్పటి వరకు లేక పోవడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా క్లైమాక్స్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా ఆరంభం నుంచి సాఫీగా సాగింది. ఒక మంచి ఫీల్‌తో సాగే సినిమాకు క్లైమాక్స్ పెద్ద స్పీడ్‌ బ్రేకర్‌గా ఉంటుంది. ఆ క్లైమాక్స్‌ కారణంగా సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్‌గా నిలిచింది అని చాలా మంది విశ్లేషకులు ఇప్పటికీ చెబుతూనే ఉంటారు. తాజాగా మరోసారి ఆ విషయమై నిర్మాత ఎంఎస్‌ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. తన సినిమాల్లో దేవిపుత్రుడు చాలా స్పెషల్‌ అని ఆయన అంటూ ఉంటాడు. నిర్మాతగా ఆ సినిమా భారీ నష్టం మిగిల్చినప్పటికీ ఒక సంతృప్తిని ఇచ్చిందని అంటారు. తాజాగా ఎంఎస్‌ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవిపుత్రుడు సినిమా ఫ్లాప్‌ కు సంబంధించిన కారణంను చెప్పుకొచ్చాడు.

వెంకటేష్ దేవిపుత్రుడు సినిమా...

ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ... దేవిపుత్రుడు సినిమా స్క్రిప్ట్‌ అంతా రెడీ అయిన తర్వాత వెంకటేష్‌ గారి వద్దకు వెళ్లాము. ఆయన స్క్రిప్ట్‌ అంతా విన్న తర్వాత చివరి 45 నిమిషాలు కొంచెం తేడాగా ఉంది, మార్చిన తర్వాత షూటింగ్‌కి వెళ్దాం అన్నారు. క్లైమాక్స్‌ ను మార్చేందుకు కోడి రామకృష్ణ గారితో తాను చాలా చర్చలు జరిపాం. పలువురు రచయితలను సంప్రదించాం. కానీ ఏ క్లైమాక్స్ సెట్‌ కావడం లేదు. దాంతో మొదట అనుకున్న క్లైమాక్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ కథకు తగ్గ క్లైమాక్స్‌ను రెడీ చేయలేక పోయాం. ఆ విషయాన్న వెంకటేష్ గారికి చెప్పి ఒప్పించి షూటింగ్‌ మొదలు పెట్టాం. వెంకటేష్ గారు పూర్తిగా ఇష్టం లేకుండానే షూటింగ్‌కి వచ్చారు. ఆయన భావించినట్లుగానే చివరి 45 నిమిషాల విషయంలోనే తేడా కొట్టింది. ఆయన చెప్పినట్లుగా కాస్త సమయం తీసుకుని క్లైమాక్స్ మార్చి ఉంటే బాగుండేదని ఆ తర్వాత అనిపించిందని అన్నాడు.

దేవిపుత్రుడు సినిమా బాక్సాఫీస్‌...

కోడి రామకృష్ణ సైతం క్లైమాక్స్ విషయంలో చాలా స్ట్రగుల్‌ అయ్యారు. కానీ చివరకు ఆయన మొదట రాసుకున్న క్లైమాక్స్‌ కే వెళ్లాల్సి వచ్చింది. దేవిపుత్రుడు సినిమాలో నటీనటులు ఎంపిక విషయమై ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు క్లైమాక్స్ విషయంలోనే తప్పు చేశాడు అంటూ చాలా మంది ఇప్పటికీ కామెంట్‌ చేశారు. సినిమా గ్రాఫిక్స్ కోసం ఆయన పడ్డ కష్టం గురించి కూడా గతంలో నిర్మాత మాట్లాడుతూ నిద్ర లేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుడు తీస్తున్న సినిమాల రేంజ్‌లో దేవిపుత్రుడు సినిమాకు ఆడే సత్తా ఉందని, క్లైమాక్స్ కారణంగానే సినిమా పోయింది అనేది విశ్లేషకుల మాట. అప్పుడు వెంకటేష్ అన్నట్లుగా కాస్త క్లైమాక్స్‌ ను మార్చి ఉంటే తప్పకుండా కమర్షియల్‌గా బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచేది. సినిమాకు డివైడ్ టాక్‌ వచ్చినప్పటికీ 60 సెంటర్స్‌లో 50 రోజులు, 3 సెంటర్స్‌ లో 100 రోజులు నడిచింది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు రూ.5 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లు సమాచారం.