సూపర్ స్టార్ వైఫ్ కి బెయిల్ మంజూరు
ఆ మొత్తం నిర్మాణ సంస్థ ఇవ్వక పోవడంతో లతా రజినీకాంత్ చెల్లించాల్సిందిగా సదరు సంస్థ డిమాండ్ చేయడం మొదలు పెట్టింది
By: Tupaki Desk | 27 Dec 2023 1:28 PM ISTతమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ పై గత కొన్నాళ్లుగా చెన్నైకి చెందిన ఓ యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెల్సిందే. కొచ్చాడియాన్ సినిమా నిర్మాణ సమయంలో లతా రజినీకాంత్ గ్యారెంటీ పై రూ.10 కోట్ల రుణాన్ని సదరు సంస్థ నిర్మాణ సంస్థకు ఇవ్వడం జరిగిందట.
ఆ మొత్తం నిర్మాణ సంస్థ ఇవ్వక పోవడంతో లతా రజినీకాంత్ చెల్లించాల్సిందిగా సదరు సంస్థ డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. లతా రజినీకాంత్ చెల్లించేందుకు నిరాకరించడంతో వివాదం కాస్త కోర్టుకు వెళ్లింది. ఈ వివాదం కారణంగా లతా రజినీకాంత్ పేరు పలు సార్లు మీడియా ద్వారా వినిపించిన విషయం తెల్సిందే.
డిసెంబర్ 1, 2023 న కోర్టు లతా రజినీకాంత్ పై ఆరోపించిన నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తూ ఆమెను కోర్టుకు హాజరు అవ్వాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఏ సమయంలో అయినా లతా రజినీకాంత్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.
ఈ నేపథ్యంలో ఆమె బెంగళూరు కోర్టు లో ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకోవడం జరిగింది. లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్ మరియు రూ.25,000 నగదు అందించి బెయిల్ ను పొందారు. సాక్ష్యులను ప్రభావితం చేయకూడదు, పిలిచిన వెంటనే హాజరు అవ్వాలనే కండీషన్స్ తో బెయిల్ ను మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది.
