Begin typing your search above and press return to search.

కొడుకు ఫోటోలు ఓకే.. భ‌ర్తనే దాస్తోంది ఎందుకిలా?

తన వార‌సుడు కోవా ఫీనిక్స్ డోలన్‌తో కలిసి ఆనందిస్తూ క‌నిపించింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో పాటు కన్నీళ్లను ఆపుకునే ముఖం ఎమోజీని కూడా షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   25 Sep 2023 5:15 AM GMT
కొడుకు ఫోటోలు ఓకే.. భ‌ర్తనే దాస్తోంది ఎందుకిలా?
X

గోవా బ్యూటీ ఇలియానా డిక్రూజ్ ల‌వ్ బ్రేక‌ప్, కెరీర్ డైల‌మా గురించి తెలిసిందే. అయితే అన్ని ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడు సంతోష‌క‌ర జీవితాన్ని లీడ్ చేస్తోంది. మేలో విదేశీ ప్రియుడు మైఖేల్ డోలన్‌ను వివాహం చేసుకుంది. ఆగస్టులో వారి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్‌కు జన్మనిచ్చింది. గతంలో ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ వంటి కార‌ణాల‌తో ఇలియానా తన పెళ్లికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతోందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే తన కొడుకు ఫోటోలను మాత్రం ఇల్లీ దాచ‌డం లేదు. హ‌బ్బీ ఎవ‌ర‌నేది మాత్రం ర‌హ‌స్యంగా దాస్తోంది. ప్ర‌తిదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్‌ఫెయిర్ & ల‌వ్‌లీ అనే చిత్రంలో న‌టిస్తోంది.


ఇంత‌లోనే ఇలియానా డి క్రజ్ తన వ్యక్తిగత జీవితంలోని పరిణామాలతో హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. చివ‌రి రాత్రి ఇలియానా డిక్రూజ్ తన ఒక నెల వయసున్న కొడుకు కోవా ఫీనిక్స్ డోలనన్ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో త‌న‌యుడి కాళ్ల‌ను క‌ప్పి ఉంచింది ఇలియానా.

తన వార‌సుడు కోవా ఫీనిక్స్ డోలన్‌తో కలిసి ఆనందిస్తూ క‌నిపించింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోతో పాటు కన్నీళ్లను ఆపుకునే ముఖం ఎమోజీని కూడా షేర్ చేసింది. అయితే ఈ ఫోటోల‌ను వీక్షించాక‌.. కొడుకు ఫోటోలు బ‌హిర్గ‌తం చేస్తోంది కానీ భ‌ర్తనే దాస్తోంది ఇంకా! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఏడాది మేలో మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని ఇలియానా వివాహం చేసుకుంది. కానీ పెళ్లికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకుంది. దాంతో డోల‌న్ ఫోటోలు బ‌హిరంగం కాలేదు. అత‌డికి సంబంధించిన ఫోటోల‌ను ఒకే ఒక్క‌సారి ఇలియానా అభిమానుల కోసం షేర్ చేసింది. కానీ వాటిలో అత‌డి ముఖం క‌నిపించ‌లేదు.

ఇలియానా చివరిసారిగా సబ్ గజాబ్ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. అభిషేక్ బచ్చన్ నటించిన 'ది బిగ్ బుల్' 2021లో విడుదలైంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రంలో ఇలియానా న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు అన్‌ఫెయిర్ & లవ్లీ - లవర్స్ చిత్రాలలో న‌టిస్తోంది. ల‌వ‌ర్స్ చిత్రంలో ప్రతీక్ గాంధీ - విద్యాబాలన్ ల‌తో కలిసి తెరను పంచుకుంటుంది.