Begin typing your search above and press return to search.

టార్జాన్‌లా మారుతున్న మ‌హేష్

దీనికోసం అంత‌ర్జాతీయ ఫిట్ నెస్ గురువు జాన్ సెనా లాంటి ఒక ప‌ర్స‌న‌ల్ కోచ్ ని నియ‌మించుకుని మ‌రీ క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడు మ‌హేష్‌.

By:  Tupaki Desk   |   3 May 2024 12:37 PM GMT
టార్జాన్‌లా మారుతున్న మ‌హేష్
X

సూప‌ర్‌స్టార్లు ఊరికే కాలేరు. త‌మ‌ను తాము చాలా మార్చుకుంటేనే స్టార్ అవుతారు. త‌మ‌ను తాము మునుపటి కంటే కొత్త‌గా ఆవిష్క‌రించుకుంట‌నే స్టార్ డ‌మ్ చిక్కుతుంది. ప్ర‌తిసారీ ఏదో ఒక కొత్త‌ద‌నం చూపించాలి. హార్డ్ వ‌ర్క్ తో కూడుకున్న సాహ‌సం చేయాలి. అప్పుడే త‌మ‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కుతుంది. బాహుబ‌లి తో ప్ర‌భాస్- రానా, ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ - రామ్ చ‌ర‌ణ్ ఇది చేసి చూపించారు. దీనికోసం అహోరాత్రులు శ్ర‌మించారు ఆ న‌లుగురు స్టార్లు. ఇప్పుడు మ‌హేష్ వంతు. జ‌క్క‌న్న కోసం చాలా పాట్లు ప‌డుతున్నాడు సూప‌ర్ స్టార్. జిమ్ లో నిరంత‌రం శ్ర‌మిస్తున్నాడు. దీనికోసం అంత‌ర్జాతీయ ఫిట్ నెస్ గురువు జాన్ సెనా లాంటి ఒక ప‌ర్స‌న‌ల్ కోచ్ ని నియ‌మించుకుని మ‌రీ క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడు మ‌హేష్‌.

ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ అన్న ప్రచారం ఉంది. దానికి త‌గ్గ‌ట్టే మ‌హేష్ విదేశీ అడ‌వుల్లో ప‌ర్య‌టించారు. త‌న కోచ్ స‌మ‌క్షంలో అక్క‌డికి విజిట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఆ త‌ర్వాత కూడా మ‌హేష్ తీవ్రంగా ప్రీప్రిప‌రేష‌న్ లో మునిగిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ద‌శ‌లో ఉంది. ఇంత‌లోనే మ‌హేష్ మేకోవ‌ర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వెబ్ లో వైర‌ల్ అవుతున్నాయి. అత‌డి లుక్ పూర్తిగా మారుతోంది. పొడ‌వాటి గిర‌జాల జుత్తు, మెలి తిరిగిన కండ‌ల‌తో టార్జాన్‌లా మారుతున్నాడ‌ని కూడా ఈ ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ సినిమాలోని కీల‌క‌ సన్నివేశాల కోసం మహేష్ బాబు తన వర్క్‌షాప్‌ను ప్రారంభించార‌నేది తాజా అప్ డేట్.

ఈ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. అంత‌ర్జాతీయ స్థాయిలో అత్యంత భారీగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. సూర్య `కంగువ` (30 పైగా దేశాల్లో విడుద‌ల‌వుతోంది) త‌ర‌హాలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు అన్ని మార్కెట్ల‌ను ప‌రిశీలిస్తున్నార‌ని స‌మాచారం. నిర్మాత కె.ఎల్‌.నారాయ‌ణ‌తో మ‌హేష్ 15 ఏళ్ల క్రితం క‌మిటైన ప్రాజెక్ట్ ఇది. ఇప్ప‌టికి చిత్రీక‌ర‌ణ‌కు వెళుతోంది. అది కూడా రాజ‌మౌళి- కె.ఎల్.నారాయ‌ణ రేర్ కాంబినేష‌న్ లో మ‌హేష్ న‌టిస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌గా దీనిని చూడాలి. సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభించ‌నున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు త్వరలో వెల్లడించ‌నున్నార‌ని తెలిసింది.