Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ కూతురి ఫస్ట్ ఫోటో చూశారా..

అయితే, ఈ మెగా ప్రిన్సెస్ ని చూడటానికి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

By:  Tupaki Desk   |   16 Aug 2023 5:40 AM GMT
రామ్ చరణ్ కూతురి ఫస్ట్ ఫోటో చూశారా..
X

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్ , ఉపాసనలు ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఇటీవల తల్లిదండ్రులయ్యారు. వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు పెళ్లైన 12 సంవత్సరాల తర్వాత వీరికి బిడ్డ జన్మించడం విశేషం. ఈ చిన్నారికి క్లింకారా అనే నామకరణం కూడా చేశారు.

అయితే, ఈ మెగా ప్రిన్సెస్ ని చూడటానికి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా వారసురాలి ఫోటో ఎప్పుడెప్పుడు షేర్ చేస్తారా? ఎప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా, తాజాగా ఉపాసన ఓ ఫోటో షేర్ చేశారు. క్లింకారాని వాళ్ల అమ్మమ్మ ఎత్తుకొని ఉన్నారు. పక్కనే తాతయ్య కూడా ఉన్నారు. వారు జాతీయ జెండాను ఎగరవేస్తున్న ఫోటో అది. ఆ జెండా తాడును క్లింకారా కూడా పట్టుకోవడం విశేషం. అమ్మమ్మ, తాతయ్యలతో ప్రెస్ లెస్ మూమెంట్ అని, క్లింకారా మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం అంటూ ఉపాసన క్యాప్షన్ లో పేర్కొన్నారు.

అయితే, ఈ ఫోటోలో క్లింకారా ఫేస్ కొంచెం రివీల్ అయ్యింది. పూర్తిగా ఫేస్ అయితే కనపడలేదు. కానీ, కొంచెం మాత్రం కనపడుతోంది. ఆ కొంచెం చూసే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అచ్చం రామ్ చరణ్ లాగానే ఉంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఈ ఫోటోలో క్లింకారా, తెలుపు, పసుపు రంగు కాంబినేషన్ గౌను ధరించి ఉంది.

నెలల పాపతో జెండా ఎగురవేయించడం మంచి ఆలోచన అని కొందరు, మెగా ప్రిన్సెస్ అంటూ కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. క్లింకారా పాప ఫేస్ కనపడుతున్న మొదటి ఫోటో ఇదే అని చెప్పాలి. నామకరణం సమయంలో ఉయ్యాలలో ఉంచినప్పుడు ఓ ఫోటో షేర్ చేశారు. కానీ, అప్పుడు కొంచెం కూడా ఫేస్ కనపడలేదు.

ఆ తర్వాత చరణ్ పెంపుడు కుక్క రైమ్ సోషల్ మీడియా ఎకౌంట్ లో మరో ఫోటో షేర్ చేశారు. అందులో నూ క్లింకారా ఫేస్ అయితే కనపడలేదు కానీ, ఉయ్యాలలో చిన్నారిని ఆ కుక్క పిల్లను తొంగి చూస్తున్నట్లుగా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ మెగా ప్రిన్సెస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.