Begin typing your search above and press return to search.

అదే టైగర్ పేరు.. చరణ్ కూతురు క్లిన్ కారా గుర్తుగా బర్డ్‌డే పోస్ట్ వైరల్!

ఇది ఇప్పుడు మా క్లీన్ కారాతో తన పేరును పంచుకుంటోంది. ఈ ప్రత్యేక గిఫ్ట్‌కి హైదరాబాద్ జూ సూపర్ కృతజ్ఞతలు" అంటూ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 11:52 AM IST
అదే టైగర్ పేరు.. చరణ్ కూతురు క్లిన్ కారా గుర్తుగా బర్డ్‌డే పోస్ట్ వైరల్!
X

మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీతో ఆడుకోగలిగే వయసు వచ్చింది క్లీన్ కారాకు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యి సంవత్సరం దాటుతోంది. తన కూతురు క్లీన్ కారా జన్మదినాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తూ ఉపాసన చేసిన తాజా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ముద్దుగా కనిపిస్తున్న టైగర్ కబ్, ఉపాసన చేతిలో క్లీన్ కారా ఉన్న ఫోటోలు అభిమానుల మనసులను గెలుచుకున్నాయి.

ఈ సందర్భంగా ఉపాసన తన పోస్టులో, "సరిగ్గా సంవత్సరం క్రితం, ఈ టైగర్ కబ్ పుట్టింది. ఇప్పుడు అది ఎంతో చురుకైన టైగ్రెస్‌గా మారింది. ఇది ఇప్పుడు మా క్లీన్ కారాతో తన పేరును పంచుకుంటోంది. ఈ ప్రత్యేక గిఫ్ట్‌కి హైదరాబాద్ జూ సూపర్ కృతజ్ఞతలు" అంటూ పేర్కొన్నారు. ఫోటోలలో ఒక దానిలో పసివాడిగా టైగర్ కబ్, మరొకదిలో పెద్దగా పెరిగిన టైగ్రెస్‌ను ఆమె కూతురితో కలిసి చూసిన మూమెంట్ ఉంది.

ఈ ఫోటోలు ద్వారా వారు తీసుకున్న కేర్ డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. టైగ్రెస్‌కు క్లీన్ కారా పేరు పెట్టడమే కాదు, "వన్యప్రాణులు అడవిలోనే ఉండాలి, అయితే అతి పెద్ద గౌరవంతో వాటిని సంరక్షించే ప్రయత్నాలను మేము మద్దతు ఇస్తాం" అంటూ ఉపాసన భావోద్వేగంగా వెల్లడించారు. క్లీన్ కారా బర్త్‌డే సందర్భంగా ఇలా ఒక టైగ్రెస్‌కు తన పేరును పెట్టడం మెగా ఫ్యామిలీని ప్రేమించే ప్రతి ఒక్కరినీ హత్తుకుంది.

ఈ పోస్ట్‌లో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ కూడా స్పందిస్తూ, “అత్యంత మధురం. మీ ముద్దుల లిటిల్ కబ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ కామెంట్ చేశారు. ఇదే సమయంలో ఎంతో మంది సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కూడా తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఇలా రామ్ చరణ్ - ఉపాసన కూతురి బర్డ్‌డే సెలెబ్రేషన్ సోషల్ మీడియాలో హడావిడిగా మారింది.

ఇక రామ్ చరణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో "నన్ను క్లీన్ కారా నాన్న అని పిలిచే రోజే, అందరికీ ఆమెను పరిచయం చేస్తాను" అని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వారు తమ కూతురి ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయకపోయినా, ఈ పిక్స్ మాత్రం భావోద్వేగాలను వ్యక్తపరచేలా ఉన్నాయి. ఇక మెగా డాటర్ దర్శనం ఎన్నటికీ జరుగుతుందో చూడాలి.